Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జబర్దస్త్ ప్రారంభం అయ్యి దాదాపు అయిదు సంవత్సరాలు అవుతుంది. ఈ అయిదు సంవత్సరాల్లో వందల మంది కమెడియన్స్ జబర్దస్త్ ద్వారా పరిచయం అయ్యారు. అందులో 15 నుండి 20 వరకు భారీ క్రేజ్‌ను దక్కించుకున్నారు. వారు ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారు. ఇతర షోల్లో సందడి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం జబర్దస్త్‌ను షేక్ చేస్తున్న కమెడియన్ హైపర్ ఆది. ఈయన స్కిట్లకు ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుతున్నారు. ఆయన స్కిట్ మొత్తం పంచ్‌లే. అన్ని పంచ్‌లు ఎలా రాస్తాడో ఏ ఒక్కరికి అర్థం కాదు. ప్రతి విషయాన్ని కూడా పంచ్‌ల రూపంలో చెబుతూ ఆద్యంతం ఆసక్తికరంగా తన స్కిట్లు ఉండేలా హైపర్ ఆది చేస్తున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్‌కు మంచి పాపులారిటీ రావడంలో హైపర్ ఆది కూడా కీలక పాత్ర పోషించాడు. ఇలాంటి హైపర్ ఆదిని తొలగిస్తారట.
ఒక్క హైపర్ ఆదిని మాత్రమే కాకుండా ప్రస్తుతం జబర్దస్త్‌లో ఫేమస్ అయిన ఏ ఒక్క కమెడియన్‌ను కూడా ఉండనివ్వరని తెలుస్తోంది. ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న కమెడియన్స్‌కు ఎక్కువ పారితోషికం ఇవ్వాల్సి వస్తుంది. అదే కొత్త వారికి ఛాన్స్ ఇస్తే తక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడంతో పాటు, కొత్త వారిని ఎంకరేజ్ చేసినట్లుగా ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. అంతా కొత్త వారితో జబర్దస్త్‌ను కొత్తగా చేయాలి అనేది మెగా బ్రదర్ నాగబాబు గారి సలహా అని తెలుస్తోంది. నాగబాబు గారి సలహా మేరకు ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతున్నాయి. పది మంది కొత్త కమెడియన్స్‌ను ఎంపిక చేసి, వారిలోంచే కెప్టెన్‌ను ఎంపిక చేయనున్నారు. మరో మూడు నాలుగు వారాల్లో కొత్త జబర్దస్త్‌ను, కొత్త కామెడీని చూడటం ఖాయం అంటూ జబర్దస్త్ నిర్వాహకులు, ఈటీవీ అధికారులు చెబుతూ వస్తున్నారు. కొత్తగా వచ్చే వారు ఆ స్థాయిలో ఆకట్టుకుంటారా అనేది అనుమానమే.
మరిన్ని వార్తలు: