వారికి చెప్పాను… మీకు చెప్పాలిన అవసరం లేదు

Nithya Menon Rejects Basavatarakam Role In NTR Biopic
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు హీరోయిన్స్‌ ఎలాంటి పాత్రల్లో అయినా నటించేందుకు సిద్దంగా ఉంటారు. ముఖ్యంగా స్టార్‌ హీరోల సరసన కేవలం పాటల కోసమే నటించమన్నా కూడా ఓకే అంటారు. అలాంటి టాలీవుడ్‌లో నిత్యామీనన్‌ చాలా విభిన్నమైన వ్యక్తి. ఈమె పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలను మాత్రమే చేస్తానంటుంది. ఎంత పెద్ద హీరో అయినా కూడా తన పాత్రకు సరైన ప్రాముఖ్యత లేకుంటే మాత్రం నో అనేస్తుంది. పారితోషికం విషయంలో పట్టింపులు లేకుండా, మనసుకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నిత్యామీనన్‌ తాజాగా ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర చిత్రాన్ని తిరష్కరించిందట.

నందమూరి బాలకృష్ణ ముఖ్య పాత్రలో తేజ దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌ చిత్రం ‘ఎన్టీఆర్‌’ స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం కాబోతుంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్రకు గాను నిత్యామీనన్‌ను సంప్రదించారట. ఆ విషయాన్ని స్వయంగా నిత్యామీనన్‌ చెప్పుకొచ్చింది. తనను ఎన్టీఆర్‌ భార్య పాత్రకు సంప్రదించారు, కాని తాను ఆ పాత్రను చేసేందుకు నో చెప్పాను అంది. ఎందుకు నో చెప్పారు అనే విషయాన్ని మాత్రం ఆమె చెప్పలేదు. మీడియా వారు ప్రశ్నించగా, నో చెప్పడానికి కారణం నన్ను సంప్రదించిన వారికి చెప్పాను, మీకు కూడా చెప్పాలిన అవసరం నాకు లేదు అంటూ మీడియాకు షాక్‌ ఇచ్చింది. ప్రస్తుతం సొంత దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది.