Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘జెంటిల్‌మన్’, ‘నిన్నుకోరి’ చిత్రాల్లో నానికి జోడీగా నటించి మెప్పించిన నివేదా థామస్ గత సంవత్సరం ఎన్టీఆర్ సూపర్ హిట్ చిత్రం ‘జైలవకుశ’ లో నటించి మెప్పించింది. భారీ అంచనాల నడుమ తెరకెక్కి విజయాన్ని సొంతం చేసుకున్న జైలవకుశ చిత్రంలో నటించినందుకు నివేదా థామస్‌కు పలు ఆఫర్లు వచ్చాయి. కాని నివేదా థామస్ సంవత్సరం పాటు కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేదు. ఆమె ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా కూడా నిర్మొహమాటంగా నో చెప్పిందట. ఎందుకు నివేదా కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా ఆ విషయమై క్లారిటీ వచ్చేసింది.
నివేదా థామస్ ఎట్టకేలకు మళ్లీ సినిమాలకు కమిట్ అవుతుంది. తాజాగా ఒక తెలుగు సినిమాను కమిట్ అయిన నివేదా థామస్ ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండటంకు కారణం చెప్పుకొచ్చింది. సినిమాలతో పాటు తనకు చదువు కూడా ముఖ్యం అని, ఆ కారణంగానే ముఖ్యమైన పరీక్షలను రాయాలని నిర్ణయించుకుని సినిమాల్లో ఆఫర్లు వచ్చినా వదిలేసినట్లుగా చెప్పుకొచ్చింది. తాజాగా తన చదువు పూర్తి చేసుకున్నాను అని, సినిమాల్లో కొంత కాలం చేసి, ఆ చదువుకు తగ్గ ఉద్యోగం లేదా వ్యాపారం చేయాలనేది తన ఆలోచన అంటూ నివేదా థామస్ చెప్పుకొచ్చింది. నివేదా ముందు చూపుకు అంతా కూడా గుడ్ అంటున్నారు. ఇకపై బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నివేదా నటించే అవకాశం ఉంది.