Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జగన్ ఆశలపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నీళ్లు చల్లింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడానికి తిరస్కరించింది. అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా జగన్ ప్రతిశుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు. అయితే వచ్చే నెల 2వ తేదీ నుంచి ఆయన పాదయాత్ర నిర్వహించనున్నారు. దీంతో పాదయాత్రలో ఉండే తాను కోర్టుకు హాజరుకావడం కష్టమవుతుందని, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదోపవాదాలు జరిగాయి.
జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే దర్యాప్తు ఆలస్యమవుతుందని సీబీఐ వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు జగన్ పిటిషన్ ను తిరస్కరించింది. ఈ నిర్ణయంపై జగన్ హైకోర్టుకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అక్కడా అనుకూల నిర్ణయం రాకపోతే.. ఏం చేయాలో జగన్ ముందే నిర్ణయించుకున్నట్టు సమాచారం. పాదయాత్ర జరిగే స్థలం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ లోని కోర్టుకు హాజరు కావాలని, విచారణ ముగిసిన తరువాత తిరిగి ఆ ప్రాంతానికే వచ్చి పాదయాత్ర కొనసాగించాలని జగన్ భావిస్తున్నారు. దీనివల్ల కోర్టుకు హాజరైనా… పాదయాత్రకు ఎలాంటి ఆటంకం ఏర్పడదన్నది జగన్ ఆలోచన.