మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత రెండు సంవత్సరాలుగా సక్సెస్ మొహం ఎరుగలేదు. ఈయన చేసిన చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. దాంతో ఈయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇటీవల విడుదలైన ‘ఇంటిలిజెంట్’ చిత్రంతో ఈయనపై మరింతగా అపనమ్మకం ఏర్పడటం జరిగింది. దాంతో తేజూ సినిమా పారితోషికం విషయంలో ఆలోచించాల్సి వచ్చింది. నిర్మాతలు ఈయనతో సినిమాలు నిర్మించేందుకు ఆసక్తిగా లేకపోవడంతో పాటు, ఇద్దరు ముగ్గురు నిర్మాతలు వచ్చినా కూడా తక్కువ పారితోషికంను కోట్ చేస్తున్నారు. దాంతో సాయి ధరమ్ తేజ్ కాస్త తెలివిగా ఆలోచించి, పారితోషికం కాకుండా లాభాల్లో వాటాను తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
తాజాగా కరుణాకరన్ దర్శకత్వంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘తేజ్ ఐలవ్ యూ’ అనే చిత్రాన్ని చేయడం జరిగింది. ఆ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయ్యి, విడుదలకు సిద్దం అవుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంకు తేజూ పారితోషికం తీసుకోలేదని తెలుస్తోంది. వరుగా తాను చేసిన సినిమాలు ఫ్లాప్ అయిన కారణంగా పారితోషికం తీసుకుని నిర్మాతను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, సక్సెస్ అయితే పారితోషికం ఇవ్వండి అంటూ తేజూ నిర్మాత కేఎస్ రామారావుతో చెప్పినట్లుగా తెలుస్తోంది. సినిమా సక్సెస్‌పై చాలా నమ్మకంగా ఉన్న తేజూకు పారితోషికం దక్కేనా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది. ఈ విషయాన్ని గురించి నిర్మాత మాట్లాడుతూ తేజూ ఈ చిత్రంకు పారితోషికం తీసుకోలేదు అని, తప్పకుండా ఈ సినిమా విజయం సాధించి, మంచి లాభాలు వస్తాయనే నమ్మకం ఉందని, ఆ నమ్మకంతోనే తేజూకు తప్పకుండా మంచి పారితోషికం ఇస్తాను అంటూ హామీ ఇస్తున్నాను అంటూ నిర్మాత చెప్పుకొచ్చాడు.