అదేమిటో కొన్ని రాజకీయ పార్టీల తీరు చూస్తుంటే భలే చోద్యంగా అనిపిస్తుంది. తెరాస పార్టీ కార్యకలాపాలను చూస్తుంటే అన్ని చోద్యాలే. తెరాస అధికారంలోకి వచ్చాక తెరాస అధ్యక్షుడు మరియు తెలంగాణ సీఎం అయిన కేసీఆర్ తన మంత్రివర్గంలో ఒక్క స్థానం కూడా మహిళలకి కట్టపెట్టకపోగా, తెరాస పార్టీ నుండి ఎన్నికైన ఒకే ఒక పార్లమెంటరీ నేత కల్వకుంట్ల కవిత. తన కూతురు కవిత కి తప్ప వేరే ఏ మహిళకు అధికారం రాజకీయం చేతకాదని అనుకునే కేసీఆర్ ఈసారి కూడా మహిళలకు రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీచేసే అవకాశం ఇవ్వలేదు. కనీసం అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేయడానికి కూడా మహిళలకు అర్హత లేదన్నట్లు ఒక్క మహిళకి పోటీ చేసే అవకాశం ఇవ్వని కేసీఆర్, ఇక తన మినిస్ట్రీ లో మహిళలకు స్థానం ఇవ్వడం కలే అవుతుంది కదా.
ఇంతచేసిన కేసీఆర్ ప్రభుత్వానికి మహిళలకి ఏమి చేశాయా తెలంగాణ చంద్రుడా అని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, కళ్ళు తెరుచుకున్న కేసీఆర్ మరియు అతని కొడుకు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అనబడే తెలంగాణ మినిస్టర్ అఫ్ ఐటీ, మినిస్టర్ అఫ్ పంచాయతీరాజ్ తో పాటు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్ & కామర్స్, పబ్లిక్ ఎంట్రప్రెస్స్, షుగర్, మైన్స్ & జియాలజి, ఎన్నారై అఫైర్స్ వంటి పలు పోర్టుఫోలియోలు వెలగబెట్టే (అదేమిటో మరి కేసీఆర్ కి తన కూతురు తప్ప ఇంకో మహిళ రాజకీయాల్లోకి అక్కరకు రాదు అని ఎలా అనుకుంటాడో తాను, తన కొడుకు తప్ప ఇంకెవరూ ఈ పోర్ట్ ఫోలియోలను వెలగబెట్టలేరు అని భలే అనుకుంటాడు) ఇద్దరూ కలిసి ఇప్పడు మహిళా సాధికారత కావాలంటే తెరాస పార్టీ కి ఓటేసి మరో నిజంగా ప్రజలచేత కీర్తించబడే కేసీఆర్ ని మరోమారు సీఎం గా గెలిపించాల్సిందిగా, అప్పుడే మహిళా పారిశ్రామికవేత్తలకు తెలంగాణాలో సముచిత స్థానమని ఊకదంపుడు ప్రకటనలతో ప్రజలను ఊదరగొడుతున్నారు. ఎంత ప్రగతి భవన్ నుండి బయటకు రాకున్నా కేసీఆర్ కి ఆమాత్రం తెలియదా తాను గానీ, తన ప్రభుత్వం గానీ తన కూతురు కవితకు తప్ప ఇంకే మహిళకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వలేదని. తెలుసులే కానీ ఆ మాత్రం మాటలతో మభ్యపెట్టకుంటే కేసీఆర్ అని ఎలా అనిపించుకుంటాడు ఈ మాటల గారడీల దిట్ట.