Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ ప్రధాన పాత్రలో తేజ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవలే ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా జరిగిన విషయం తెల్సిందే. ఈ చిత్రం కోసం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రం గురించి ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ చిత్రం స్క్రిప్ట్‌ను ఎంత కుదించిన నాలుగు గంటలకు పైగానే వస్తుందని, రెండున్నర మూడు గంటల్లో ఎన్టీఆర్ జీవిత చరిత్రను చూపించడం అసాధ్యం అనిపిస్తుందని, అలా చూపించినా కూడా న్యాయం చేయలేమనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్ సభ్యులు చివరకు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
గతంలో తెలుగు సినిమాు ‘రక్త చరిత్ర’ మరియు ‘బాహుబలి’ చిత్రాలు రెండు పార్ట్‌లుగా వచ్చిన విషయం తెల్సిందే. ఒక కథను సింగిల్ పార్ట్‌లో చెప్పలేని సమయంలో ఇలా రెండు పార్ట్‌లుగా విడదీసి చూపించడం హాలీవుడ్ నుండి బాలీవుడ్‌కు, బాలీవుడ్ నుండి టాలీవుడ్‌కు వచ్చింది. ఇప్పుడు అదే ఫార్ములాను దర్శకుడు తేజ వాడాలని భావిస్తున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ‘ఎన్టీఆర్’ చిత్రాన్ని రెండు పార్ట్‌లుగా తీసుకు రావాలని నిర్ణయించారు. మొదటి పార్ట్‌లో ఎన్టీఆర్ సినీ జీవితం రెండవ పార్ట్‌లో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని చూపించబోతున్నారు. ఈ రెండు పార్ట్‌లు కూడా మూడు గంటలకు కాస్త అటు ఇటుగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. షూటింగ్ రెండు పార్ట్‌లకు సంబంధించి పూర్తి చేసిన తర్వాత మూడు నెలల గ్యాప్‌లో రెండు చిత్రాలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతుంది.