బ్యూటీషియన్ పద్మ దాడి కేసు గంట గంటకూ అనేక మలుపులు తిరుగుతోంది. పద్మపై హత్యాయత్నం చేశాడని అనుమానిస్తున్న నూతన్ కుమార్ రైలు కింద పది ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు మిస్టరీగా మారింది. విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న పద్మ స్పృహలోకి వచ్చాక నోరు విప్పితే కానీ మిస్టరీ వీడని పరిస్థితి. ఈ నేపథ్యంలో పద్మ ప్రియుడిగా భావిస్తున్న నూతన్ కుమార్ భార్య సునీతను పోలీసులు సోమవారం విచారించారు. తన భర్త చనిపోవడానికి బ్యూటీషియన్ పద్మనే కారణమని సునీత తెలిపింది. అంతేకాక నూతన్ కుమార్ భార్య సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తతో బ్యూటీషీయన్ పద్మతో వివాహేతర సంబంధం విషయం భర్త సూర్యనారాయణకు కూడ తెలుసునని చెప్పారు. డబ్బుల కోసమే పద్మ తన భర్త నూతన్‌కుమార్‌తో సంబంధాన్ని కొనసాగించిందని ఆమె ఆరోపించారు.
అయితే పద్మతో పాటు మరికొందరు మహిళలను కూడ నూతన్ కుమార్ వలలో వేసుకొన్నాడని గతంలో ఏలూరులో బ్యూటీషీయన్‌తో కూడ నూతన్ కూడ సంబంధం పెట్టుకొన్నాడని పోలీసుల విచారణలో తేలింది. నూతన్ కుమార్ ఓ షోరూమ్‌లో పనిచేసే సమీపంలో మేనేజర్‌గా పనిచేసే సమయంలో పద్మతో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే నూతన్ కుమార్ తో బ్యూటీషీయన్ పద్మకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం పద్మ భర్త సూర్యనారాయణకు తెలిసింది. దీంతో భార్య, భర్తల మధ్య విబేధాలు వచ్చాయి. అలాగే నూతన కుమార్‌ది ఏలూరులోని వెన్నవెల్లివారి పేట. తండ్రి ఆర్మీ ఉద్యోగి, తల్లి వీడీవో ప్రస్తుతం ఇద్దరూ బ్రతికి లేరు. చెల్లి, అన్నయ్య ఉన్నారు. తల్లి అనారోగ్యానికి గురైనపుడు అన్నను మోసం చేసి ఉమ్మడిగా ఉన్న ఇంటిని తనపేరున రాయించుకొన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆ స్థలాన్ని రెండు సంవత్సరాల క్రితం అమ్మ గా వచ్చిన రూ.36లక్షల్లో కొంత సొమ్ము స్నేహితులకు వడ్డీలకు ఇచ్చాడని తెలుస్తోంది.
మరో వైపు నూతన్ కుమార్ వద్ద ఉన్న డబ్బుల కోసమే పద్మను ఆమె భర్త సూర్యనారాయణే పంపేవాడని నూతన్ కుమార్ భార్య సంచలన ఆరోపణలు చేసింది. నూతన్ కుమార్ వద్ద ఉన్న డబ్బులు అయిపోయాక అతడితో సంబంధాలు తెంచుకొనేందుకు యత్నించారని ఆమె ఆరోపణలు చేశారు. పద్మతో నూతన్ కుమార్ వివాహేతర సంబంధం పెట్టుకొన్న విషయం తెలిసిన తర్వాత నూతన్ కుమార్ కు ఆయన భార్య దూరంగా ఉంటున్నారు. అయితే నూతన్ భార్య చేసిన ఆరోపణలను పద్మ భర్త సూర్యనారాయణ ఖండించాడు. అనుక్షణం తన బ్యాగులో విషం బాటిల్ పెట్టుకొని తాను సూసైడ్ చేసుకొంటానని నూతన్ బెదిరించి పద్మతో సంబంధం కొనసాగించేవాడని సూర్యనారాయణ చెబుతున్నారు. దీంతో ఈ కేసులో ఇప్పుడు పద్మ స్పృహలోకి వస్తే కానీ ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొంది.