తెలుగు బిగ్‌బాస్ సీజన్ 2లో సామాన్యులకు ఛాన్స్ ఇవ్వడంతో సామాన్యుల కోటాలో రాజకీయ నాయకుడు అయిన నూతన్ నాయుడు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. నూతన్ నాయుడు వ్యక్తిత్వం కొంతమందిని ఆకర్షించింది. ఆయన ఏది అనుకుంటే అది చెప్పే మనస్థత్వం. ఇంట్లో ఉన్న కౌశల్‌కు ఈయన మంచి మిత్రుడు అయ్యాడు. ఇంట్లో మెల్ల మెల్లగా సర్దుకు పోతున్న సమయంలోనే రెండవ వారంలోనే నూతన్ నాయుడు ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయిన నూతన్ నాయుడు అనుకోని అవకాశంగా ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా మళ్లీ బిగ్‌బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కింది. బిగ్‌బాస్ ఇంట్లోకి నూతన్ నాయుడు ఎంట్రీ ఇచ్చాడో లేదో చేతికి గాయం కారణంగా నూతన్ నాయుడు ఇంట్లోంచి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా కౌశల్‌కు మద్దతు తెలుపుతున్న సమయంలో నూతన్ నాయుడు చేయి గాయం అయ్యింది. ఆ కారణంగా నూతన్ నాయుడు బయటకు వచ్చాడు. కౌశల్ ఆ సమయంలో తీవ్ర నిరాశను వ్యక్తం చేశాడు. గేమ్ నుండి నూతన్ నాయుడును పంపించేస్తున్నట్లుగా ఇప్పటి వరకు బిగ్‌బాస్ పంపించలేదు. అందుకే నూతన్ నాయుడు ఎంట్రీ గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా స్టార్ మా నుండి అందుతున్న లీక్‌లను బట్టి చూస్తే నూతన్ నాయుడు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మూడవ సారి నూతన్ నాయుడుకు బిగ్‌బాస్ ఛాన్స్ కల్పించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. కౌశల్ ఆర్మీ ఒత్తిడికి తలొగ్గిన షో నిర్వాహకులు నూతన్ నాయుడును మళ్లీ పంపించేందుకు సిద్దం అయ్యారు. రేపు లేదా ఆ తర్వాత రోజు అయినా నూతన్ నాయుడు రీ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తుంది.