Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల, కాకినాడ ఫలితాలు టీడీపీలో ఎక్కడలేని జోష్ తెచ్చేశాయి. దీంతో ఈ రెండు ఎన్నికల మోడల్ తయారుచేసి.. 2019 ఎన్నికలకు రెడీ కావాలని చంద్రబాబు చెప్పేశారు. వర్క్ షాప్ లో కూడా ఇదే చెప్పడంతో.. ఇక సీనియర్లు మోడల్ బుక్ తయారీలో బిజీగా ఉన్నారు.
పనిలో పనిగా వైసీపీ నేతలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ చెప్పుకుంటోంది. కానీ ఇదందా దుష్ప్రచారమేనని వైసీపీ మేకపోతు గాంభీర్యం ఒలకబోస్తోంది. నిజానికి 20 మంది వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీగా ఉన్నారట.
ఎవరు పార్టీ మారతారో.. టీడీపీతో పాటు వైసీపీకి కూడా క్లారిటీ ఉంది. అయినా సరే ఎవరికి వారు పాలిటిక్స్ చేస్తున్నారు. జగన్ తో ఉంటే ఏమీ దక్కదని ఆయన సన్నిహిత ఎమ్మెల్యేలు కూడా అనుకుంటున్నారని తెలుస్తోంది. దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే.. ఇక ఆపరేషన్ ఆకర్ష్ పార్ట్ టూ షురూ అయినట్లే.
మరిన్ని వార్తలు: