ఆప‌రేష‌న్ వాలెంటైన్ రివ్యూ – వ‌రుణ్ తేజ్ మూవీ ఎలా ఉందంటే?

Operation Valentine Review - How is Varun Tej's movie?
Operation Valentine Review - How is Varun Tej's movie?

విడుదల తేదీ : మార్చి 01, 2024

తెలుగుబుల్లెట్ రేటింగ్ : 3/5

నటీనటులు: వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్, నవదీప్, మిర్ సావర్, తదితరులు

దర్శకుడు: శక్తి ప్రతాప్ సింగ్ హడా

నిర్మాత: సందీప్ ముద్దా, సోనీ పిక్చర్స్

సంగీత దర్శకులు: మిక్కీ జే మేయర్

సినిమాటోగ్రాఫర్‌: హరి కె. వేదాంతం

ఎడిటింగ్: నవీన్ నూలి

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ “ఆపరేషన్ వాలెంటైన్”. కాగా ఈ మూవీ ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అర్జున్ రుద్ర (వరుణ్ తేజ్) వింగ్ కమాండర్. అర్జున్ దేశ రక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్స్ ను టెస్ట్ చేసే విభాగంలో పని చేస్తుంటాడు. స్వతహాగా ఆవేశపరుడైన రుద్ర ‘ఆపరేషన్ వజ్రా’లో ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో పుల్వామా దాడి జరుగుతుంది. 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి ?, వింగ్ కమాండర్ అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి ?, ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అయిన మరో కమాండర్ అహ్న ( మానుషి చిల్లర్) పాత్ర ఏమిటి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందంటమే ఈ మూవీ కు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువ మూవీ లు రాకపోవడంతో ఈ మూవీ లో కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులకు ఒక సరి కొత్త అనుభూతినిస్తుంది. ఇక రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు.

కొన్ని స్పేస్ సన్నివేశాల్లో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన బాగుంది. ఈ మూవీ లో హీరోయిన్ గా నటించిన మానుషీ చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పెర్ఫార్మెన్స్ తో ఆమె మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన మిర్ సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్ తో పాటు మిగిలిన ప్రధాన పాత్రధారులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

Operation Valentine Review - How is Varun Tej's movie?
Operation Valentine Review – How is Varun Tej’s movie?

మైనస్ పాయింట్స్ :

పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఎలా సాగింది ?, అలాగే ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలోని సన్నివేశాలు బాగానే ఉన్నా.. దర్శకుడు కథనాన్ని మాత్రం పూర్తి ఆసక్తికరంగా మలచలేకపోయారు. కీలకమైన సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాల్లో కొన్నిటిని మాత్రం ఆసక్తికరంగా మలచలేకపోయారు.

మూవీ చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుంది ?, హీరో అండ్ టీమ్ ఎలాంటి కష్టాల్లో పడతారో, వాళ్ళు అనుకున్నది ఎలా సాధిస్తారో అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఇంకా ఎక్కువ పెంచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం ఆ దిశగా మూవీ ని నడపలేదు. ఇక మూవీ ఫస్టాఫ్ కథనం కూడా సాదా సీదాగానే గడిచిపోయింది. దీనికి తోడు మూవీ లో కొన్ని చోట్ల మరీ సినిమాటిక్ గా అనిపిస్తోంది.

సాంకేతిక విభాగం :

మంచి కథా నేపధ్యాన్ని తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడ్డారు. కానీ, స్పేస్ నేపథ్యంలో ఆయన రూపొందించిన సన్నివేశాలు, విఎఫ్ఎక్స్ వర్క్ ను వాడుకున్న విధానం ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంది. హరి కె. వేదాంతం సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నిర్మాతలు సందీప్ ముద్దా, సోనీ పిక్చర్స్ నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.

తీర్పు :

‘ఎయిర్ ఫోర్స్’ నేపథ్యంలో స్పేస్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ కొన్నిచోట్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. కథలోని మెయిన్ పాయింట్ మరియు ఫ్లైట్ ల మధ్య సాగే యాక్షన్ సన్నివేశాలు, ఎమోషన్స్ అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ మూవీ లో ఆకట్టుకున్నాయి. కానీ, నెమ్మదిగా సాగిన కథనం, లాజిక్ లేని కొన్ని కీలక సన్నివేశాలు వంటి అంశాలు మూవీ కి బలహీనతలుగా నిలుస్తాయి. ఓవరాల్ గా భిన్నమైన యాక్షన్ మూవీ ల ను ఇష్టపడేవారికి ఈ మూవీ నచ్చుతుంది.