మెగా ఫ్యాన్స్‌కు చేదు వార్త చెప్పిన నిహారిక

Oru Nalla Naal Paathu Solren Release only Tamil

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మెగా ఫ్యామిలీ నుండి అరంగేట్రం చేసిన మొదటి హీరోయిన్‌ నిహారిక. ఇప్పటికే నిహారిక ‘ఒక మనసు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ చిత్రం పెద్దగా ఆకట్టుకోక పోవడంతో తెలుగులో కాస్త గ్యాప్‌ తీసుకుని ఇప్పుడు తన రెండవ సినిమాను చేస్తోంది. టాలీవుడ్‌లో గ్యాప్‌ తీసుకున్న సమయంలో కోలీవుడ్‌లో నిహారిక ఒక చిత్రాన్ని చేసింది. విజయ్‌ సేతుపతి హీరోగా తెరకెక్కిన ‘ఒరు నల్ల నాళ్‌ పాతు సొల్రెన్‌’ చిత్రంలో నటించింది. ఆ సినిమాను ఫిబ్రవరి 2న విడుదల చేయబోతున్నారు. తమిళంలో చాలా అంచనాలున్న ఆ చిత్రాన్ని తెలుగులో కూడా డబ్బింగ్‌ చేసి విడుదల చేస్తారని మెగా ఫ్యాన్స్‌తో పాటు అంతా భావించారు. కాని మెగా ఫ్యాన్స్‌ ఆశలపై నిహారిక నీళ్లు జల్లింది.

తాజాగా ఆ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా తమిళనాట ఆమె మీడియాతో ముచ్చటించింది. ఆ సమయంలోనే తమిళంలో చేసిన మొదటి తనకు చాలా సంతృప్తిని ఇచ్చిందని, నటిగా తనను తాను ఈ చిత్రంలో ఆవిష్కరించబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. తమిళ భాష రాకపోవడంతో కాస్త ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే అయినా కూడా సినిమాలో తన పాత్రపై ప్రభావం చూపలేదు అంటూ చెప్పుకొచ్చింది. ఇక ‘ఒరు నల్ల నాళ్‌ పాతు సొల్రెన్‌’ చిత్రం తెలుగులో రిలీజ్‌ ఎప్పుడు అంటూ మీడియా వారు ప్రశ్నించిన సమయంలో తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేయబోవడం లేదు అంటూ బాంబ్‌ పేల్చింది.

నిర్మాతలకు తెలుగులో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచన లేదని, తాను కూడా తెలుగులో ఈ సినిమా విడుదలవ్వాలని కోరుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. విజయ్‌ సేతుపతికి తెలుగులో పెద్దగా మార్కెట్‌ లేదు. అందుకే తెలుగులో ఆ సినిమాను విడుదల చేయాలని భావించడం లేదు. అయితే నిహారిక కోసం విడుదల చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాని ఆ చిత్రంలో నిహారికది పూర్తి స్థాయి హీరోయిన్‌ పాత్ర కాదు, సెకండ్‌ హీరోయిన్‌ అవ్వడం వల్లే తెలుగులో విడుదల చేసినా కూడా పెద్దగా ఫలితం ఉండక పోవచ్చు అనే ఉద్దేశ్యంతో డబ్బింగ్‌కు ఆసక్తి చూపడం లేదు. నిహారిక సినిమా తెలుగులో విడుదల కాకపోవడం మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌ అని చెప్పుకోవచ్చు