Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీనటులు : గోపీచంద్ , అను ఇమ్మనుఎల్, రాశి ఖన్నా , సాక్షి చౌదరి , జగపతిబాబు
నిర్మాతలు: AM రత్నం , ఐశ్వర్య
దర్శకత్వం : జ్యోతికృష్ణ
సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు
ఎడిటర్ : ఎస్. బి ఉద్ధవ్
మ్యూజిక్ : యువన్ శంకర్ రాజా
“ఆక్సిజన్ “… ఏ ముహూర్తంలో ఈ సినిమాకు ఈ పేరు పెట్టారో గానీ నిజంగా ఇప్పుడు ఇందులో పనిచేస్తున్న ముఖ్యులు లైఫ్ అండ్ డెత్ సిట్యుయేషన్ లో విజయం అనే ఆక్సిజన్ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. లౌక్యం తర్వాత హిట్ అనే స్వీట్ దక్కని హీరో గోపి చంద్, ఇక చేసిన రెండు మూడు సినిమాలు ప్లాప్ అయ్యి ఈసారి ఎన్నో ఆశలతో వస్తున్న జ్యోతికృష్ణ, ఇటు కొడుకు భవిష్యత్ అటు తెలుగులో పూర్వ వైభవం కోసం పోరాడుతున్న ఏ .ఎం .రత్నం నిర్మాతగా విజయం అనే ఆక్సిజన్ ఈసారైనా దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
జ్యోతికృష్ణ ఇంతకుముందు చేసిన సినిమా ఫలితం చూసాక కూడా గోపీచంద్ ఈ సినిమా ఒప్పుకోడానికి ప్రధాన కారణం ఏ. ఎం. రత్నం. మీరు నిర్మాతగా ఉంటే ఈ సినిమా చేస్తానని గోపీచంద్ అనగానే ఆయన ముందుకు వచ్చారు. అలా పట్టాలు ఎక్కిన ఈ ప్రాజెక్ట్ నిర్మాణ దశలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంది. అందుకే సినిమా అనుకున్న దాని కన్నా ఆలస్యం అయ్యింది. అయినా కధలో ఫ్రెష్ నెస్ ఆ లోపం తెలియనీయదని చిత్ర యూనిట్ భరోసాగా వుంది. ఫ్యామిలీ, యాక్షన్ కలగలిపిన ఈ సినిమా కధలో అండర్ కరెంట్ గా దేశభక్తి ఉంటుంది.ఈ సినిమా చూసాక ప్రతి ఒక్కడూ చనిపోయేలోగా దేశం కోసం ఏదైనా చేయాలి అనుకుంటాడు అని దర్శకుడు చెప్తున్న మాటలు ఆక్సిజన్ మీద ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. గోపీచంద్ కూడా ఈ సినిమాతో తనను మళ్లీ విజయం వరిస్తుందన్న ధీమాతో వున్నారు.