Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పద్మావతిపై రోజుకో వివాదం తలెత్తుతోంది. సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ, పద్మావతి మధ్య ప్రేమ సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ రాజ్ పుత్ లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సినిమా విడుదలను నిలిపివేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పద్మావతి విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. అయితే స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించడంతో వివాదం కొంత సద్దుమణిగింది. ఈ లోగా పద్మావతి హీరో రణ్ వీర్ సింగ్ మరో కొత్త వివాదానికి తెరలేపాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర పోషిస్తున్న రణ్ వీర్ సింగ్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసి కలకలం రేపారు. ఖిల్జీ లుక్ తో ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన రణ్ వీర్ నా మతాన్ని కోల్పోతున్నాను అంటూ ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమయింది.