Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ధర్మయుద్ధం కొనసాగుతుంది. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది. ఇదీ పళని బలపరీక్షలో నెగ్గాక పన్నీర్ చెప్పిన మాటలు. ఇప్పుతు తమిళనాడులో ఓ సర్వే కూడా అదే నిజమంటోంది. ప్రస్తుతానికి పళనికి మద్దతిస్తున్న ఎమ్మెల్యేల మనసుల్లో కూడా పన్నీరే ఉన్నారని, పళని కంటే పన్నీరే బెటరని భావన ఉందని బాంబు పేల్చింది. ఈ సర్వే ఫలితాలు ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ గా మారాయి.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో 60 శాతం మంది, దినకరన్ కు 20 శాతం మంది, దీపకు రెండు శాతం మంది మాత్రమే సహకరిస్తారట. గతంలో పన్నీర్ తో సమానంగా ప్రాధాన్యం ఉన్న ఎడప్పాడి పళనిస్వామి.. ఇప్పుడు పూర్తిగా అనామకుడిలా మారిపోయారట. పేరుకు సీఎం అయినా సొంత నిర్ణయాలు తీసుకోలేని నిస్సహాయత ఆయన అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేసింది.
దినకరన్ ను అవినీతిపరుడిగా చూస్తున్న తమిళులు.. ఆయన వెనుక నిలబడే ఎమ్మెల్యేల్ని గెలిపించడం సందేహమే. మొదట్నుంచీ జయ వారసత్వం కోసం సిన్సియర్ గా పోరాడుతున్న పన్నీర్ ను ఎక్కువ మంది ఆదరించే అవకాశం కనిపిస్తోంది. బలపరీక్షకు కనీవినీ ఎరుగని రీతిలో ఖర్చుపెట్టడం ద్వారా పళని తన ఇమేజ్ దిగజార్చుకున్నారు. మరి పన్నీర్ క్లీన్ ఇమేజ్ ఎన్నికల్లో సర్వే చెప్పినట్లే పనిచేస్తుందా. లేదంటే సర్వే బోగస్సా అనేది ఎన్నికలు వచ్చినప్పుడే తేలుతుంది.
మరిన్ని వార్తాలు :