Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇప్పటివరకు అనంతపురం జిల్లాలో పెనుగొండ మాత్రమే పరిటాల ఫ్యామిలీ నియోజకవర్గంగా ఉంది. అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు వ్యూహాత్మకంగా పరిటాల సునీతను రాప్తాడు నుంచి బరిలోకి దించి గెలిపించారు. ఇక జిల్లాలో కూడా పరిటాల వర్గానిదే ఆధిక్యతగా ఉంది. మెజార్టీ ఎమ్మెల్యేలు పరిటాల ఫ్యామిలీ మాట కాదనరు. కానీ ఇప్పుడు అదే ఫ్యామిలీ బాబును కోరికలు కోరుతోంది.
ప్రస్తుతం రాప్తాడు ఎమ్మెల్యేగా ఉన్న పరిటాల సునీత.. వచ్చే ఎన్నికల్లో పెనుగొండ బరిలో దిగాలని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. అయితే తనకు సీటిస్తే చాలదని తన కుమారుడికి కూడా మరో సీటివ్వాలని బాబును కోరుతున్నారట. పరిటాల శ్రీరాం కన్ను ధర్మవరం నియోజకవర్గం మీద పడిందని తెలిసి.. లోకల్ ఎమ్మెల్యే వరదాపురం సూరి కిందామీదా పడుతున్నారు. పరిటాల ఫ్యామిలీకి ఎలా చెక్ పెట్టాలని మథనపడుతున్నారు.
అన్నీ తెలిసిన చంద్రబాబు మాత్రం ప్రస్తుతానికి సైలంట్ గా ఉన్నారు. నంద్యాల ఎన్నికల్లో కూడా ఇలాంటి పోటీ వస్తే సర్వే రిపోర్టుల ఆధారంగా నిర్ణయం తీసుకున్న చంద్రబాబు.. ఈసారి కూడా సర్వేల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే నేతలకు విలువ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. రాప్తాడు ప్రజలు సునీతకు ఇచ్చిన మార్కుల్ని బట్టే.. ఆమె మాట చెల్లుతుందా.. లేదా అనేది ఆధారపడి ఉంది.
మరిన్ని వార్తలు: