Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పరిటాల రవి తనయుడు శ్రీరామ్ పెళ్లి గురించి ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా దాన్ని ఎవరూ ధ్రువీకరించలేదు. ఇప్పుడు ఆ కొరత కూడా తీరిపోయింది. తన కుమారుడు శ్రీరామ్ పెళ్లి కుదిరిన మాట నిజమేనని మంత్రి పరిటాల సునీతమ్మ ప్రకటించారు. తన కార్యకర్తలకి ఈ శుభవార్త తో పాటు పెళ్లి జరగబోయే డేట్, ఇక వధువు కుటుంబ వివరాలు కూడా తొలిసారి బయటికి చెప్పారు.
పరిటాల సునీతమ్మ తన కార్యకర్తలతో పంచుకున్న సమాచారం ప్రకారం ఈ నెల 10 న హైదరాబాద్ లో పరిటాల శ్రీరామ్ నిశ్చితార్ధం జరుగుతుంది. వధువు అనంతపురం జిల్లా , శింగనమల నియోజకవర్గం, నార్పల మండలానికి చెందిన avr కన్స్ట్రుక్షన్స్ అధినేత ఆలం వెంకటరమణ కుమార్తె ఆలం జ్ఞాన. అక్టోబర్ 1 న వివాహం జరుగుతుంది.
మరిన్ని వార్తలు: