‘అజ్ఞాతవాసి’ కథ ఇదే అంటున్నారు

pawan-kalyan-25th-movie-agn

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రా తర్వాత పవన్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. పవన్‌కు ఇది 25వ సినిమా అవ్వడంతో త్రివిక్రమ్‌ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాకు ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. దీపావళికి ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. దీపావళికి ఈ సినిమా టైటిల్‌పై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది.

ఈ సమయంలోనే ఈ సినిమాకు సంబంధించిన కథ అంటూ ఒక స్టోరీ సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. అది కాస్త అటు ఇటుగా అత్తారింటికి దారేది చిత్రం కథ ఉన్నట్లుగా ఉంది. ఆ కథలో నిజం ఎంత ఉందో కాని, ఆ కథ విషయానికి వస్తే… పవన్‌ కళ్యాణ్‌ విదేశాల్లో ఒక పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అధినేత తనయుడు. ప్రపంచంలోనే టాప్‌ బిలియనీర్‌కి వారసుడు. అయితే కొన్ని కారణాల వల్ల హైదరాబాద్‌లోని ఒక చిన్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌ చేసేందుకు జాయిన్‌ అవుతాడు. అక్కడ పవన్‌ చేసిన పనులు ఏంటి, పవన్‌ ఎలా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేశాడు అనేది కథలో ఉంటుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

కథ ఎలా ఉన్నా కూడా దర్శకుడు త్రివిక్రమ్‌ తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించగలడు. పవన్‌, త్రివిక్రమ్‌లు ఖచ్చితంగా మ్యాజిక్‌ చేస్తారు అని ప్రేక్షకులు ఆశాభావంతో ఉన్నారు. పవన్‌కు జోడీగా ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ మరియు అను ఎమాన్యూల్‌లు జంటగా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం టీజర్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో దాదాపు 200 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ను చిత్రం చేసినట్లుగా సమాచారం అందుతుంది. త్రివిక్రమ్‌తో ఇప్పటికే ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అఆ’ చిత్రాలను నిర్మించిన రాధాకృష్ణ ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు.