Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా పవన్ బర్త్‌డే సందర్బంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించి, టైటిల్‌ను రివీల్ చేస్తారని అంతా భావించారు. కాని షాకింగ్‌గా చిత్ర యూనిట్ సభ్యులు ఒక చిన్న పాటను విడుదల చేసి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశారు. టైటిల్‌ను మాత్రం రివీల్ చేయలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దసరా కానుకగా టైటిల్‌ను రివీల్ చేసి, టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. ఈలోపు సినిమా టైటిల్ లీక్ అయ్యింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ 25వ చిత్రానికి ‘అజ్ఞాతవాసి’ అనే విభిన్న టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో వచ్చిన సినిమాకు ‘అత్తారింటికి దారేది’ అనే విభిన్న టైటిల్‌ను ఖరారు చేశారు. ఇప్పుడు అదే తరహాలో ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్‌ను త్రివిక్రమ్ ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. దీన్నే దసరా సందర్బంగా విడుదల చేయబోతున్నారు. చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ టైటిల్‌ను అధికారికంగా నిర్థారిస్తున్నారు. వచ్చే సంవత్సరం జనవరిలో సంక్రాంతి కానుకగా 8వ తారీకున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పవన్ 25వ సినిమా అయిన కారణంగా ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది.
మరిన్ని వార్తలు: