Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చే ముందు మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టుగానే నిరుద్యోగ భృతి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ప్రజా పోరాట యాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. నిరుద్యోగ భృతికి డిగ్రీ, లేదా డిప్లొమా అర్హత ఉండాలనంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలు మారుతున్నారనీ, ఆడపడుచులూ అక్కచెల్లెళ్లు మారుతున్నారనీ, యువత మారుతోందన్నారు. నిరుద్యోగ భృతిపై నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంపై విమర్శలు చేశారు. యువత జనసేనకు ఆకర్షితులవుతున్నందు వల్లే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామని చెబుతోందన్నారు. ప్రభుత్వం ఇచ్చే నిరుద్యోగ భృతిని నమ్మవద్దన్నారు. ఇలాంటివి మోసం చేసే పథకాలు తప్ప నిజంగా యువతకు న్యాయం చేసే పథకాలు కావన్నారు. జనసేనను చూసి యువతను ఆకర్షించే ఇలాంటి పథకాలు పెడితే ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. డిగ్రీ చదవకపోతే వారంతా యువత కాదంట అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలు పవన్ అజ్ఞానానికి అడ్డం పడుతున్నాయంటున్నారు విశ్లేషకులు ఎందుకంటే చదువుకున్నవారికి అర్హతకు తగ్గ ఉద్యోగావకాశాలు లేకపోయే స్థితినే నిరుద్యోగం అంటాం అలాంటివారికి చేయూతనందించే పథకమే నిరుద్యోగ భ్రుతి. కాబట్టి, దీనికి డిగ్రీ లేదా డిప్లొమా అనేది కనీస అర్హతగా పెట్టుకున్నారు. కానీ, పవన్ ఏమంటారంటే…
డిగ్రీ చదవనివారు యువత కాదా, వారికి ఇవ్వరా అన్నట్టు అభిప్రాయపడుతున్నారు. కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే అనిపిస్తుంది అదెలా సాధ్యమౌతుంది అని ఎందుకంటే అసలు విద్యార్హత ఉన్నా లేకున్నా యువత అందరినీ నిరుద్యోగులుగా చూడాలంటే సాధ్యమయ్యే పనేనా ? ఎటూ టీడీపీతో తెగదెంపులు చేసేసుకున్నాం కాబట్టి నాలుగేళ్ళు ఆ టీడీపీతో ఎలా కలిసున్నావ్ ? అని ఎవరూ ప్రశ్నించే అవకాసం ఇవ్వకుండా ప్రతీరోజూ ఏదో ఒక అంశాన్ని టీడీపీ టార్గెట్ గానే చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో తప్పులేదు, ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు అధికార పక్షం చేసే ఏ పని మీద అయినా మాట్లాడవచ్చు కానీ పథకాల విషయంలో ఆచరణ సాధ్యం కాని విమర్శలు పవన్ చేయడం ఆయన అపరిపక్వత తెలుపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.