తెలంగాణాలో కాంగ్రెస్ అంటే పవన్ కి గౌరవం…ఆంధ్రాలో కూడా ఇదే మాట ?

pawan kalyan comments on congress party at pawan poltical yatra

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణాలో రాజకీయ యాత్ర చేయడం అంటేనే చిత్రం అనుకుంటే అంతకన్నా విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు ఆయన. రాజకీయాలను మార్చే ఉద్దేశం తోటే జనసేన స్థాపించినట్టు చెప్పుకున్న పవన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్యల మీద అధికార పక్షాన్ని ప్రశ్నించడం అంటే బాధ్యతాయుతంగా వ్యవహరించడం తప్ప గొడవపడటం కాదని పవన్ చెప్పుకొచ్చారు. దీనికి కొనసాగింపు అన్నట్టు తన పర్యటన మీద విమర్శలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకుల గురించి ప్రస్తావించారు.

వీ హెచ్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే తాను ఆయనకు మద్దతు ఇస్తానని చెప్పారు. అదే ఊపులో కాంగ్రెస్ పార్టీ అంటే తనకు గౌరవం ఉందని కూడా పవన్ వ్యాఖ్యానించారు. ఏ పార్టీ , వ్యక్తుల మీద ద్వేషం లేదని చెప్పడానికి పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ మీద గౌరవం ఉందనడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ని మట్టి కరిపించడానికే nda కు మద్దతు ఇచ్చినట్టు చెప్పుకున్న పవన్ తాజా వ్యాఖ్యలు అందుకు పూర్తి భిన్నంగా వున్నాయి. ఈ వ్యాఖ్యలకు ఇప్పుడు ఆంధ్రాలో పవన్ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.

పవన్ రాకతో ఇబ్బందిపడుతున్న వైసీపీ ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని కాచుకు కూర్చుంది. ఈ పరిస్థితుల్లో పవన్ కామెంట్స్ మీద వైసీపీ రాద్ధాంతం చేయొచ్చు. బీజేపీ తో పొత్తు కోసం తహతహలాడుతున్న వైసీపీ ఈ ఛాన్స్ ని అందిపుచ్చుకునే ఆలోచనలో వుంది. వైసీపీ ఈ విషయంలో సక్సెస్ అయితే పవన్ కి ఆంధ్రాలో సమాధానం చెప్పడం కాస్త ఇబ్బందికరమే.