జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ నిశ్చితార్ధపు వార్త పెద్ద సంచలనం ఏమీ కాదు. కొన్నాళ్లుగా ఆమె సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు చూచాయగా ఆమె మనోగతాన్ని వివరిస్తున్నాయి. తన జీవితంలోకి కొత్త వ్యక్తి వస్తున్న విషయాన్ని ఆమె చెప్పకనే చెబుతున్నారు. అయితే ఆ బంధం గురించి అంత ధైర్యంగా చెప్పిన ఆమె , ఆ బంధంలోకి వచ్చిన వ్యక్తి ఎవరో చెప్పకుండా దాస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారు ఆమె అనే డౌట్ సహజమే. నిజానికి రేణు దేశాయ్ ఇలాంటి విషయాలకు భయపడే వ్యక్తి కాదు.
ఇంతకుముందు తనకు మరో పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పినప్పుడు పవన్ ఫాన్స్ సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ , వార్నింగ్ లకు కూడా రేణు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అలాంటి రేణు ఇప్పుడు కాబోయే భర్త విషయంలో ఎందుకు సీక్రెట్ మైంటైన్ చేస్తున్నారు అనే సందేహానికి ఆమె సన్నిహితుల దగ్గర నుంచి ఓ సమాధానం వస్తోంది.
రేణు జీవితంలోకి వచ్చే వ్యక్తి గురించి లేనిపోని ప్రచారం జరిగితే అది మున్ముందు తనతో పాటు భర్తకి కూడా వ్యక్తిగత స్వేచ్చకీ అడ్డు వస్తుందని రేణు భావిస్తున్నారట. దీంతో పాటు పవన్ ఫాన్స్ సోషల్ మీడియాలో చేసే అనవసర రచ్చతో పిల్లలు ఇద్దరు ఇబ్బంది పడతారని రేణు భయపడుతున్నారట. అందుకే ఆమె ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కొత్తగా తన జీవితంలోకి వచ్చే వ్యక్తికి , పవన్ ద్వారా కలిగిన సంతానానికి మధ్య కూడా మంచి రిలేషన్షిప్ బిల్డ్ అయ్యేలా రేణు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారట. పిల్లలు కూడా పూర్తి స్థాయిలో ఓకే అన్నాకే రేణు ఈ పెళ్ళికి సిద్ధం అయినట్టు సమాచారం.