నాలుగేళ్ల క్రితమే పార్టీ పెట్టినా ఇప్పటి వరకు సరయిన విధి విధానాలు లేకుండా రాజకీయం చేస్తూ వచ్చిన పవన్ తన పరత్రి నాలుగో వార్షికోత్సవ సభ నుండి స్పీడ్ పెంచాడు. అప్పటి వరకు తాను మద్దతు ఇచ్చిన తెలుగుదేశం మీదే అనేక విమర్శలు చేస్తూ తాజాగా పోరాట యాత్ర పేరుతో యాత్ర చేస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యుల్లు పూర్తి చేసుకోగా మరో రెండు రోజుల్లో మూడవ షెడ్యుల్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే రెండు రాష్ట్రాలలో జనసేన ఉంటుందని చెబుతున్నా తెలంగాణాలో ఆ పార్టీ ఉనికి ప్రస్నార్ధకం ? అందుకే అమరావతి ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో విజయవాడలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ అద్దె ఇంటిని తీసుకున్నారు. పటమటలో ఉన్న సువిశాలమైన ఇంట్లోకి పవన్ సతీ సమేతంగా నేడు గృహ ప్రవేశం చేయనున్నారని తెలుస్తోంది.
ఇటీవలే పవన్ నాగార్జున వర్శిటీ సమీపంలోని కాజ గ్రామంలో దాదాపు 2 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, అక్కడ తన ఇంటిని, కార్యాలయాన్ని తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. ఈ పనులు ఆలస్యమయ్యే అవకాశాలు ఉండటంతోనే, అద్దె ఇల్లు తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీని కోసం పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి కృష్ణా జిల్లా గన్నవరం చేరుకున్నారు. ఈ ప్రత్యేక విమానం టాలీవుడ్ కి చెందిన ఒక యువ ప్రొడ్యూసర్ దిగా తెలుస్తోంది. అమరావతిలో పవన్ కల్యాణ్ రెండు రోజులు పర్యటిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్కు వస్తారు. విశాఖపట్నం జిల్లాలో జనసేన పోరాట యాత్రను ఈ నెల 26 నుంచి తిరిగి ప్రారంభిస్తారు. అలాగే, పవన్ ఉత్తరాంధ్ర మేధావులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. అనంతరం ఆయన తూర్పు గోదావరి జిల్లాలోనూ పర్యటించనున్నారు.