Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్… ఈ పేరు ఎంత సంచలనమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. హిట్టు, ఫ్లాప్పులతో సంబంధం లేకుండా పవన్క కళ్యాణ్ కు ఫాన్ ఫాలోయింగ్ ఉంది. అదే ఆయన్ను కొత్త రాజకీయ పార్టీ పెట్టేలా ప్రేరేపించింది. అన్నయ్య చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో చురుకైన పాత్రే పోషించిన పవన్… ఆ పార్టీ కాంగ్రెస్ లో కలిసిపోయిన తరువాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తర్వాత 2014 ఎన్నికలకు ముందు ఓ సభ నిర్వహించి టీడీపీ, బీజేపీకి మద్దతు పలికారు. అనంతరం జనసేన పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి రాజకీయాలపైనా… ప్రజాసమస్యలపైనా ఆయన తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఇందుకు ఆయన ఎంచుకున్న మాద్యమం ట్విట్టర్.
సెలబ్రిటీలు చాలామందికి ట్విట్టర్ అకౌంట్ ఉన్నా…పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఉపయోగించినంతగా మిగిలిన వారెవరూ వాడుకోలేదని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ భావాల వ్యక్తీకరణ అంతా ట్విట్టర్ ద్వారానే జరుగుతుంది… ట్విట్టర్ వేదికగా జనసేనను నడుపుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి. వీటి సంగతి పక్కన పెడితే ట్విట్టర్ లో పవన్ పేరిట ఓ సరికొత్త రికార్డు నమోదయింది. ఆయన ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య రెండు మిలియన్లకు చేరింది. 2014 ఆగస్టులో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించారు.
మరిన్ని వార్తలు: