Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంట రేపుతున్నాయి. నాలుగేళ్ళుగా కలిసి బీజేపీ-తెలుగుదేశాలు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో విడిపోయాయి. అయితే కేంద్రం నుండి తెలుగుదేశం ఎప్పుడు అయితే బయటకి వచ్చిందో అప్పటి నుండే హోదా ఇవ్వాల్సిన కేంద్రం మీద కాకుండా దానికి మిత్రపక్షమయిన తెలుగుదేశం మీద విషం చిమ్మటం మొదలెట్టాయి వైసీపీ, జనసేన. దీంతో రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి కొంత చూచాయగా వారి లోపాయికారీ బంధం అర్ధమయ్యే ఉంటుంది. కాస్త లాజికల్ గా బుర్ర పెట్టి ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ చాల చక్కగా నరేద్రమోడీకి దాసోహం అయ్యాడు అని అర్ధం అవుతుంది.
ఉదాహరణకి శ్రీ రెడ్డి అంశం గత నెల రోజులపై నుండి జరుగుతుంది. కానీ తమకి న్యాయం చేయండి అన్నా అని కోరిన శ్రీ రెడ్డి మీద పవన్ స్పందించింది 14/04/2018. అంతకు ముందు వరకు పవన్ కళ్యాణ్ ను మీడియా అసలు పట్టించుకోలేదు. కాని శ్రీ రెడ్డి పవన్ ని తిట్టింది మాత్రం 16/04/2018. ఆ తరువాత నుండి మీడియా పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ చేసింది. అయితే 16వ తేదీన ఆమె తిడితే నాలుగు రోజులు ఊరుకుని సరిగ్గా కేంద్రానికి వ్యతిరేకంగా చంద్రబాబు దీక్ష చేసే రోజున శ్రీ రెడ్డి దూషించడం గురించి అంశాన్ని లేవనెత్తి చంద్రబాబు దీక్ష మీద ఫోకస్ లేకుండా ఉండేందుకు ప్రయత్నించాడు.
పవన్ కి శ్రీ రెడ్డి దూషించిన విషయం ఆరోజే తెలియకపోవచ్చు కనీసం తర్వాతి రోజయినా తెలుస్తుంది కదా, ఆయన స్పందించాలి అనుకుంటే నాగబాబు స్పందించిన సమయంలో కాని అరవింద్ స్పందించిన సమయంలో తన స్పందన తెలియచేయవచ్చు. కానీ చంద్రబాబు దీక్ష తేదీనే ఎందుకు ఎంచుకున్నారు ? తన ట్విట్టర్ లో చెప్పినట్టు గత 6 నెలలు గా తనని, తన తల్లిని గురించి కుట్రలు చేస్తున్నారు అని చెప్పారు. కానీ నిజానికి పవన్ కళ్యాణ్ శ్రీ రెడ్డి టాపిక్ లోకి వచ్చింది 16/04/2018. పోనీ ఆ కుట్రలు మీకు ముందే తెలిసి ఉంటే ఎందుకు బయట పెట్టలేకపోయారు. ఒకప్పుడు “నా కొడుకు” అని సంభోదించిన కేసీఆర్ విషయంలో మీడియా మొత్తం ఆ తిట్టుని బాగా కవర్ చేసింది కాని అప్పుడు మీరెందుకు స్పందించలేదో ? కానీ ఇప్పుడు సడన్ గా తెలుగుదేశం చేత ప్రభావితం అయిన మీడియా తనని తన తల్లిని దూషిస్తుంది అంటూ ఆరోపించడం పవన్ ని బీజేపీ ఆడిస్తుంది అనే విషయాన్ని యిట్టే అర్ధం చేసుకోవచ్చు.
అదీకాక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ చానెల్స్ ని అయితే బహిష్కరించండి అన్నారో ఆ చానెల్స్ గత కొన్ని నెలలుగా బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి గంటల తరబడి చర్చలు పెట్టి బీజేపీని తిట్టినవే. ఆ తర్వాత శ్రీ రెడ్డి విషయం ప్రముఖంగా ప్రచారం చేసినవి టీవీ9 మహా టీవీ, ఆంధ్రజ్యోతి అయినా టీవీ5 ని కూడా చేర్చడానికి కారణం ఆ చానెల్స్ అన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఉండటం. ఈ అంశం బీజేపీ పవన్ కళ్యాణ్ ను ఉపయోగించుకొని తమ మీద విమర్శలు చేస్తున్న మీడియా ని తెలుగుదేశం మీడియా గా చిత్రించి నిజాలను పక్కదోవ పట్టించటానికి వేసిన ఎత్తుగడ అని విశ్లేషకుల వాదన.
ఇక మరో విషయానికి వస్తే ఇప్పటివరకు తన పార్టీ సింద్ధాంతాలను కూడా ప్రకటించని పవన్ కళ్యాణ్ కి ఇంత సడన్ గా చిత్తూరు సమస్యలు ఎందుకు గుర్తుకు వచ్చాయో తెలుసా ? ఏప్రిల్ 30 న చంద్రబాబు నాయుడు తిరుపతి వెంకన్న సాక్షిగా నరేద్రమోడీ ఇచ్చిన వాగ్ధానాలను, ఆయన మభ్య పెట్టిన తీరును ప్రజలముందుకు తీసుకువస్తున్నాడు. ఆ రోజు మరలా దీక్ష చేసి కేంద్రం రాష్ట్రానికి చేసిన మోసాన్ని వివరించబోతున్నారు. దాని నుండి ప్రజల, మీడియా ద్రుష్టి మరల్చాడానికి వేసిన ఎత్తుగడే పవన్ కళ్యాణ్ చిత్తూరు యాత్ర. ఇప్పటికే జగన్ కూడా బాబు దీక్ష రోజే వంచన దినం పాటిస్తాం అంటూ ప్రకటించడం చూస్తే బాబుని చూసి కేంద్రం ఏ విధంగా భయపడుతుందో అర్ధం చేసుకోవచ్చు. కేంద్రం చేతిలో కీలుబొమ్మలా మారిన పవన్ కళ్యాణ్ మున్ముందు ఇంకెన్ని ప్లాన్ చేస్తాడో ఏమో ?