Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాష్ట్ర నాలుగో ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు చెప్పారు. ఆరున్నర దశాబ్దాల పోరాటంతో సిద్దించిన ఈ రాష్ట్రం సుసంపన్నం కావాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. వందలమంది పోరాటయోధులు తమప్రాణాల్ని తృణప్రాయంగా త్యాగం చేసి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారని, ఆ వీరుల త్యాగాలను ఎల్లవేళలా గుర్తుచేసుకుంటూ, వారి కలలను సాకారం చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం పాడిపంటల్లో, పరిశ్రమల్లో, ఉపాధి, ఉద్యోగ కల్పనలో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్టు పవన్ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.