Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, రాజకీయ నాయకుడిగా ఎంతగా వార్తల్లో ఉంటాడో, కొన్ని సార్లు ఆయన వ్యక్తిగత విషయాల కారణంగా కూడా వార్తల్లో ఉంటాడు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్ పలు సందర్బాల్లో వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే. ఎంతో మంది, ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా కూడా తన వ్యక్తిగత జీవితం విషయంలో మీడియా ముందు సమర్ధించుకునే ప్రయత్నం చేయకపోవడంతో పాటు, వివరణ కూడా ఇచ్చేందుకు ఆసక్తి చూపించడు. తాజాగా పవన్ గురించి మరో ఆసక్తికర విషయం చర్చనీయాంశం అవుతుంది.
పవన్‌కు మొదటి భార్య అయిన నందిని ద్వారా ఎలాంటి పిల్లలు లేరు. రెండవ భార్య రేణు దేశాయ్ ద్వారా ఇద్దరు పిల్లలున్నారు. ఒక పాప, ఒక బాబుకు రేణు దేశాయ్ జన్మనిచ్చింది. ఆమెతో విడాకులు అయిన తర్వాత పవన్ అన్నా లెజ్నోవా అనే రష్యకు చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె ద్వారా పవన్‌కు ఒక పాప జన్మించింది. ఇప్పుడు పవన్‌కు ముగ్గురు పిల్లలు. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ తండ్రి కాబోతున్నట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ మూడవ భార్య అన్నా గర్బవతి అని, అక్టోబర్ లేదా నవంబర్‌లో ఆమె డెలవరీకి సిద్దంగా ఉందని మెగా సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి పవన్ మరోసారి తండ్రి కాబోతున్నాడన్న వార్త ఆయన అభిమానులకు కొంచెం ఇష్టం, కొంచెం కష్టం అన్నట్లుగా ఉంది.
మరిన్ని వార్తలు: