Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిని స్ఫూర్తిగా తీసుకుని ట్విట్టర్ అజ్ఞాతం నుంచి తాను బయటికి వచ్చినట్టు ప్రకటించిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చాడు. అజ్ఞాతవాసి పోస్టర్ ను మార్ఫింగ్ చేసి పవన్ ముఖం స్థానంలో తన ముఖం పెట్టి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఈ పోస్టర్ కు బహిరంగ వాసి అని టైటిల్ పెట్టాడు. ఈ ఫొటో ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. వర్మ ఫొటో పోస్ట్ చేసిన కాసేపటికే లక్షల్లో లైక్ లు వచ్చాయి.
అజ్ఞాతవాసి విడుదల కాగానే కూడా వర్మ తన దైన స్టయిల్ లో కామెంట్ చేశాడు. గోళ్లు, పళ్లు లేని పులిని నేనెప్పుడూ చూడలేదు. బెల్ట్ తో కొడుతున్న సన్నివేశాలు చూసి నిర్ఘాంతపోయాను. మరో షాకింగ్ అంశం ఏంటంటే..ఈ పులి దూకకుండా పాకుతోంది అని వర్మ తన పోస్ట్ లో పేర్కొన్నాడు. ఇప్పుడు అజ్జాతవాసికి, బహిరంగవాసి అని పేరు పెట్టి పోస్టర్ పెట్టాడు. గతంలో అర్జున్ రెడ్డి విషయంలోనూ వర్మ ఇలానే చేశాడు. హీరో విజయ్ దేవరకొండ స్థానంలో తన ముఖం మార్ఫింగ్ చేసి..రాంగోపాల్ రెడ్డి టైటిల్ తో పోస్టర్ ను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.