Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Pawan Kalyan’s Past Secrets Is Surprised Says SV Naganath
ఎస్వీ నాగనాథ్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా మీడియాలో తెగ చర్చకు తెరలేపుతున్నాడు. ఈయన సెలబ్రెటీల గత జన్మ రహస్యాలను చెబుతున్నాడు. ఒక ఛానెల్లో ప్రసారం అయ్యే కార్యక్రమంలో ఎస్వీ నాగనాథ్ ఇప్పటి వరకు రాజమౌళి, అల్లు అర్జున్‌ల గత జన్మ రహస్యాలను చెప్పాడు. తాజాగా పవన్ కళ్యాణ్ గత జన్మ రహస్యం చెప్పి అందరిని ఆశ్చర్యపర్చుతున్నాడు. ఈయన చెబుతున్న దాంట్లో నిజం ఉందో లేదో తెలియదు కాని, ఈయన స్టార్స్ గత జన్మ రహస్యాలు చెబుతుండటంతో అంతా ఆసక్తిని కనబర్చుతున్నారు.
అల్లు అర్జున్ గత జన్మలో ఒక రైతు అంటూ చెప్పిన నాగనాథ్ తాజాగా పవన్ కళ్యాణ్ రాజ కుటుంబంకు చెందిన వ్యక్తిగా చెప్పుకొచ్చాడు. చాలా సంవత్సరాల క్రితం ఇండియాకే చెందిన ఒక రాజ కుటుంబంలో పవన్ కళ్యాణ్ పుట్టాడని, గత జన్మలో కూడా వైవాహిక జీవితం సరిగా ఉండేది కాదని, తన దాన గుణం వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా నాగనాథ్ చెబుతున్నాడు. రాజు కుటుంబంకు చెందిన కొందరు వ్యక్తులు పవన్ కళ్యాణ్‌పై విష ప్రయోగం చేయడం వల్ల తక్కువ వయస్సులోనే చనిపోయాడని చెప్పుకొచ్చాడు. ఆ జన్మలో చేసిన పుణ్యాల కారణంగానే పవన్ కళ్యాణ్ ఇప్పుడు గొప్ప నటుడిగా, కోట్లాది మంది అభిమానంను పొందేలా పుట్టాడని నాగనాథ్ చెప్పుకొచ్చాడు. పవన్ గురించి నాగనాథ్ చెబుతున్న విషయాలు ప్రస్తుతం అందరిలో ఆసక్తిని కలగిస్తున్నాయి.
మరిన్ని వార్తలు :