Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ అధినేత జగన్ పాదయత్రకి సర్వం సిద్ధం అవుతోంది. పార్టీ పరిస్థితి అంతకంతకూ దిగజారుతున్న ఈ పరిస్థితుల్లో నాయకులని కాపాడుకోవడమే జగన్ కి పెద్ద సవాల్ గా మారింది. ఇక ఈ క్లిష్ట పరిస్థితుల్లో జగన్ పాదయాత్ర కి ఖర్చు ఎవరు పెట్టుకుంటారు ?. అదే సందిగ్ధం కొనసాగినప్పుడు జగన్ సన్నిహితుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి భరించడానికి ముందుకు వచ్చారు.
ఇటీవల జరిగిన సమావేశంలో జగన్ పాదయాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్ విషయంలో ఎవరికి ఏ అభ్యంతరం లేదు. రాలేదు. అయితే ఆయా నియోజకవర్గాల నుంచి పాదయాత్ర జరుగుతున్నప్పుడు అయ్యే ఖర్చు భరించే విషయంలో మాత్రం చాలా మంది నేతలు చేతులు ఎత్తేసినట్టు మాట్లాడారు. కాదు మీరే ఖర్చు భరించాలని జగన్ కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితి ఏర్పడిందట. ఆ సమయంలో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ముందుకు వచ్చి పాదయాత్ర ఖర్చులు ఏ ఇబ్బంది లేకుండా తానే చూసుకుంటానని చెప్పడంతో అప్పటికి సమస్య కొలిక్కి వచ్చింది. పాదయాత్ర, బస్సు యాత్ర కలిపి మొత్తం 175 నియోజకవర్గాలు తిరగాల్సి వుంది. దీనికి ఖర్చు భారీగానే ఉన్నప్పటికీ కొడుకు ఇచ్చిన మాటకి వెనక్కి తగ్గకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జగన్ టూర్ కి వున్న ప్రధాన సమస్య తీరిపోయింది.