రజినీకాంత్, శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన 2.ఓ చిత్రం ఈనెల చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంను పైరసీ చేస్తామంటూ తమిళ రాకర్స్ హెచ్చరించారు. ఇటీవల వీరు సర్కార్ మూవీని విడుదలైన కొన్ని గంటల్లోనే హెచ్ డీ ప్రింట్‌తో విడుదల చేస్తామని ప్రకటించారు. దాంతో సర్కార్ చిత్ర యూనిట్ సభ్యులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా కూడా ఏమాత్రం ప్రయోజనం లేదు. అన్నట్లుగానే వారు సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే సినిమాను పైరసీ చేసి ఆన్‌లైన్‌లో పెట్టేశారు. దాంతో సర్కార్ చిత్రానికి చాలా నష్టం జరిగిందని చిత్ర యూనిట్ సభ్యులు తమిళ సినీ వర్గాల వారు అంటున్నారు. ఇప్పుడు 2.ఓ చిత్రానికి కూడా అదే హెచ్చరిక వచ్చింది.
దాదాపు 600 కోట్ల బడ్జెట్ తోరూపొందిన ‘2.ఓ’ చిత్రాన్ని లీక్ చేసి తీరుతాం అంటూ తమిళ రాకర్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. హాలీవుడ్ సినిమా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంను పైరసీ చేయడం వ్ల పెద్ద నష్టం జరగడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు. దాంతో సినిమా నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం చేయాలో పాలుపోక నిర్మాతలు పైరసీని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పైరసీ అడ్డుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తే తమిళ రాకర్స్ అంత త్వరగా సినిమాను లీక్ చేసేందుకు చూస్తున్నారు. దాంతో నిర్మాతలు ఏం చేయలేక చేతులు కట్టుకుని చూస్తున్నారట. మరో వైపు సినిమాను బిగ్ స్క్రీన్‌లో చూస్తేనే బాగుంటుందని ప్రచారం చేస్తున్నారు.