Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈమద్య సినిమాలకు సంబంధించిన ప్రతి విషయం వివాదాస్పదం అవుతున్న విషయం తెల్సిందే. ఎంత జాగ్రత్తగా తీసినా కూడా కొందరు అందులోని లోపాలను వెదికి తమ మనోభావాలను దెబ్బ తీసే విధంగా సినిమా ఉందని కొందరు కేసులు పెట్టడం చేస్తున్నారు. అలా చేయడం వల్ల వారికి పబ్లిసిటీ దక్కుతుంది. అందుకే ఇటీవ ప్రతి విషయం వివాదాస్పదం అవుతుంది. తాజాగా తమిళ సినిమా ‘ఒరు అడార్ లవ్’ అనే చిత్రంలోని ప్రియ వారియర్ కను సైగలు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇలా ఎక్కడ చూసినా కూడా ఆమె కనుసైగలు తెగ చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని పబ్లిసిటీగా మార్చుకునేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన కొందరు ముస్లీం యువకులు ఫలక్‌నామా పోలీస్ స్టేషన్‌లో ఈమెపై ఫిర్యాదు చేశారు. నటి ప్రియ వారియర్ చేసిన కను సైగలు తమ మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని కేసు పెట్టారు. కేవలం 30 సెకన్ల వీడియోలో ఆమె కనబర్చిన హావబావాలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యువతను ఫిదా చేస్తున్నాయి. కాని హైదరాబాద్ ముస్లీం కుర్రాలు మాత్రం మనోభావాలు దెబ్బ తీశాయి అంటూ పోలీసు కేసు పెట్టారు. వారు ఈ కేసు పెట్టిన కారణం పబ్లిసిటీ అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈమద్య ఇలా కేసులు పెట్టి మీడియాలో పబ్లిసిటీ దక్కించుకోవాలనుకునే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. అందుకే వీరి కేసును స్వీకరించకుండా, తిరిగి వారిపైనే కేసు పెట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రియ వారియర్ కొన్ని లక్షల మంది కుర్రకారు గుండెలను బద్దలు చేసేసింది.