Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హిందీలో సూపర్ సక్సెస్ అయిన బిగ్‌బాస్ షో తమిళంలో ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెల్సిందే. కమల్ హాసన్ హోస్ట్‌గా నడుస్తున్న ఈ షోకు తమిళ ప్రేక్షకుల నుండి పెద్దగా ఆధరణ రావడం లేదు. ఇదే సమయంలో తమిళ సంస్కృతిని, సాంప్రదాయాలను నాశనం చేసే విధంగా ఈ షో ఉంది అంటూ విమర్శలు వస్తున్నాయి. హిందూ మక్కల్ కచ్చి సంస్థ బిగ్ బాస్ షోను నిలిపేయాలంటూ కేసు నమోదు అయ్యింది. పోలీసులు కేసును నమోదు చేసుకుని, షో నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది.
తమిళ బిగ్ బాస్ షో నిర్వాహకులకు మరియు కమల్ హాసన్‌కు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లుగా, వారి నుండి పోలీసులు వివరణ కోరినట్లుగా తెలుస్తోంది. అయితే షో నిర్వహకులు మాత్రం హిందూ మక్కల్ కచ్చి వారు ఆరోపిస్తున్నట్లుగా తమిళ సాంప్రదాయాలను ఏమాత్రం భంగం కలగకుండా ఈ షోను చేస్తున్నామని చెబుతున్నారు. తమిళుల గొప్పదనం ఈ షోతో తెలుస్తుందని కూడా వారు చెబుతున్నారు. ఈ విషయమై కమల్ మాత్రం సైలెంట్‌గా ఉన్నాడు. తమిళనాడులో ఇలాంటివి కామన్. హిందూ మక్కల్ కచ్చి వారు ఏం చేసినా ఇలా నానా యాగీ చేయడం సర్వ సాదారణం. ఇక తెలుగులో ఈ షోను ఈనెల 16 నుండి ప్రారంభించబోతున్నారు. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్న ఈ షోకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.