తన అందంతోను, నటనతోను ఆకట్టుకుంటూ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న పూజా హెగ్డే తన చిన్ననాటి అనుభవాలను మీడియాతో పంచుకుంది. జనాలను చూస్తే చాలా సిగ్గుపడే స్థితి నుండి ప్రస్తుతం కెమెరా ముందు నటించే స్థాయికి ఎదిగాను అంటూ ముచ్చటపడుతోంది. నాకు చిన్నతనంలో కాలిగ్రఫలో మంచి నైపుణ్యం ఉండేది దాంతో మా తాతగారు కోరడంతో ముంబై అథ్లెటిక్ అసోసియేషన్‌లో విద్యార్థుల పేర్లను చాలా అందంగా రాశాను, అందుకు వారు నాకు 200 ఇచ్చారు అప్పట్లో దానికే జాక్‌పాట్ కొట్టినంతగా ఫీల్ అయ్యాను, అదే నా మొదటి సంపాదన అంటూ పూజా తన తొలి సంపద గురించి చెబుతూ తెగ మురిసిపోతుంది.
కాలేజ్ డేస్‌లో చాలా సింపుల్‌గా ఉండే పూజా కనీసం లిప్‌స్టిక్ కూడా వేసుకునేది కాదట. నాకు నా అందంపై అంతగా నమ్మకం లేదు. కానీ 2009 మిస్ ఇండియా టాలెంటెడ్‌గా నిలిచా అప్పుడు కాస్త నమ్మకం పెరిగింది. అంతేకాకుండా 2010లో మిస్ యూనివర్స్ రన్నప్‌గా నిలిచాను. ఆ తర్వాత వివిధ యాడ్‌లలో నటించాను. నా స్నేహితురాలి సూచనతో సౌత్ సినిమాల్లో ట్రై చేశాను. తమిళంలో ఒక అవకాశం వచ్చింది. అప్పుడు నటన వారే నేర్పించి డబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు, తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తూనే ఉన్నా. అప్పటి నుండి ఇక కెరియర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు అంటూ పూజా తన కెరియర్ గురించి మీడియాతో పంచుకుంది. మొత్తానికి 200తో సంపాదన మొదలెట్టిన పూజా ప్రస్తుతం కోట్లలో పారితోషికాన్ని పుచ్చుకుంటోంది.