పవన్ కళ్యాణ్ సరసన పూజిత పొన్నాడ

పవన్ కళ్యాణ్ సరసన పూజిత పొన్నాడ

పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమాలపై కూడా దృష్టి పెట్టాడు. అందుకే వరుసగా సినిమాలు చేసే పనిలో పడ్డాడు. తాజాగా పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో ‘వకీల్ సాబ్‌’గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ లుక్‌కు సంబంధించిన పోస్టర్ కూడా ఇటీవలే విడుదలైంది. అయితే కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ వాయిదా వేసుకున్నారు. మరోవైపు పవన్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో ఒక భారీ చారిత్రక చిత్రం రూపొందనుంది. ఆంగ్లేయుల కాలంలో పేదల కోసం దోపిడీలు చేసే రాబిన్ హుడ్ పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కొంతమంది పేర్లను పరిశీలించారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ ను ఎంపిక చేశారని సమాచారం. మరోవైపు ఈ సినిమాలో రంగస్థలం హీరోయిన్ కూడా కనిపిస్తుందని ఇప్పుడు టాలీవుడ్ టాక్.

క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే ఐటమ్ సాంగ్ కూడా ఉందని తెలుస్తోంది. ఆ పాట కోసం తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడను తీసుకున్నారని తెలుస్తోంది. ‘కల్కి’ .. ‘రంగస్థలం’ సినిమాల్లో పూజిత పొన్నాడ సందడి చేసింది. ఆకర్షణీయమైన ఆమె రూపానికి కుర్రకారు ఫిదా అయ్యింది. అయితే ఇప్పుడు పూజిత పొన్నాడ పవన్ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ చేస్తుందని సమాచారం. పవన్ – క్రిష్ సినిమాలో ఆమె చేసే ఐటమ్ సాంగ్ తో ఆమె మరింత పాపులర్ అవుతుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. పవన్ సినిమాకు సంబంధించి కొత్త కొత్త అప్‌డేట్స్ వస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.