Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో ఒక్కసారిగా బాలీవుడ్ రేంజ్లో గుర్తింపు దక్కించుకున్నాడు. ‘బాహుబలి’ కోసం దాదాపు అయిదు సంవత్సరాల పాటు వేరే సినిమాలు ఒప్పుకోని ప్రభాస్ ఎట్టకేలకు ‘సాహో’ సినిమాను చేస్తున్నాడు. సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది. భారీ అంచనాలున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో ప్రభాస్‌కు అస్వస్థత అయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.
వరుసగా చిత్రీకరణలో పాల్గొన్న నేపథ్యంలో ప్రభాస్ అస్వస్థతకు గురయ్యాడని, వెంటనే ప్రముఖ హాస్పిటల్లో ప్రభాస్‌ను జాయిన్ చేసి చికిత్స అందించినట్లుగా వారు చెబుతున్నారు. ప్రభాస్ అస్వస్థత కారణంగా ‘సాహో’ చిత్ర షూటింగ్‌కు మూడు రోజుల బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్‌తోనే సీన్స్ చిత్రీకరణ ఉన్న నేపథ్యంలో మొత్త యూనిట్ సభ్యులకు కూడా మూడు రోజుల పాటు బ్రేక్ ఇవ్వడం జరిగింది. యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ప్రభాస్ అస్వస్థతకు గురయ్యాడు. కొన్ని రోజుల ముందు ప్రభాస్‌తో శ్రద్దా కపూర్ షూటింగ్లో పాల్గొంది. మళ్లీ వచ్చే నెలలో ప్రభాస్‌తో కలిసి ఆమె చిత్రీకరణలో పాల్గొనబోతుంది. వచ్చే సంవత్సరం వేసవిలో సాహోను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.