Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చెప్పేవాడికి వినేవాడు లోకువ అనే సామెతని నిజం చేస్తున్నాడు వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. జగన్ పరిచయం చేసిన వైసీపీ నాయకులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన మైండ్ బ్లాక్ అయ్యే సమాధానాలు ఇచ్చారట. ఓ పెద్దాయన ఎన్నికల వ్యూహాలకు 250 కోట్లు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది కదా అది నిజమేనా అని ప్రశాంత్ ని అడిగాడట. అందుకు ప్రశాంత్ అబ్బే అందులో నిజం లేదని , మొత్తం ఫ్రీ గా సేవ చేసి పెడుతున్నానని బదులు ఇచ్చాడట. అది విన్న ఆ పెద్దాయన ఎవరి చెవిలో పువ్వులు పెడతారంటూ మెల్లిగా గొణుక్కోవడం కనిపించిందట. పైగా ప్రశాంత్ పేరుతో బయటికి వస్తున్న ఓ వార్త వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ రేపుతోంది.
జగన్ కి ప్రశాంత్ ఇచ్చిన ప్రాధమిక నివేదికలో ఓ 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పని తీరు బాగా లేదని వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దని సూచించారట. ఆ విషయం అయితే బయటికి వచ్చింది గానీ ఆ జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయన్నది తెలియక మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలంతా టెన్షన్ గా వున్నారు. పైగా నియోజకవర్గానికి ఓ ఐఐటి విద్యార్థి వస్తాడని ప్రశాంత్ చెప్తున్న మాటలు కూడా వారికి రుచించడం లేదట. క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలియని వాళ్ళు చెప్పినట్టు వింటే అసలుకే ఎసరు వస్తుందని భయపడుతున్నారు. ఈ విధంగా ప్రశాంత్ ఫ్రీ గా ఓ పాతికమందికి ఎర్త్ పెట్టేసి చోద్యం చూస్తున్నారు.
మరిన్ని వార్తలు