Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నితీష్ కుమార్ తిరిగి బీజేపీ గూటికి చేరడం వెనుక.. రామ్ నాథ్ కోవింద్ కథ నడిపారన్న వాదన బలంగా వినిపిస్తోంది. బీహార్ గవర్నర్ గా వెళ్లినప్పట్నుంచి నితీష్ ను దువ్వుతున్న కోవింద్.. ఇటు మోడీని కూడా లైన్లో పెట్టారు. ఇప్పుడు రాష్ట్రపతిగా మరింత సాధికారికంగా వ్యవహరించారు. అందుకే ప్రభుత్వం సంక్షోభంలో పడగానే రామ్ నాథ్ మోడీతో చక్రం అడ్డం వేశారు.
ఎవరు చెప్పినా వినని నితీష్.. కోవింద్ చెబితే ఎందుకు వింటున్నారనే దాని వెనుక బలమైన కారణం ఉంది. కోవింద్, నితీష్ కు ఎప్పట్నుంచో సన్నిహితుడు. ఆ సాన్నిహిత్యంతోనే మోడీ అంటే ఇష్టం లేకపోయినా నితీష్ రాజీకి సిద్ధపడ్డారు. పైగా అవినీతి మరక తొలగడం ముఖ్యం కాబట్టి.. విభేదాలు పక్కనపెట్టారు.
కోవింద్ చాణక్యం చూస్తుంటే.. ఆయన్ను రాష్ట్రపతిగా మోడీ ఎందుకు ఎంపిక చేశారో తెలిసిపోతోంది. ఈ లెక్కన రేపు కేంద్రంలో అవసరమైనా.. కోవింద్ చక్రం తిప్పుతారని మోడీ ధీమాగా ఉన్నారు. అవసరమైతే బలాబలాలు కాస్త అటూఇటైనా కోవింద్ అండగా ఉంటారనే ఆయన్ను గెలిపించారు. చూడాలి మరి కోవింద్ నిజంగా అంత సాహసం చేస్తారో.. లేదో.
మరిన్ని వార్తలు: