కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పచ్చని అడవిని లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పర్యావరణాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే.. రేవంత్ సర్కార్ మాత్రం అటవీ సంపదను నాశనం చేస్తుందని మండిపడ్డారు నరేంద్ర మోదీ. కాంగ్రెస్ మోసపూరిత హామీలిచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చి, ఆ హామీలను గాలికొదిలేయడమే కాకుండా ప్రకృతిని ధ్వసం చేస్తూ స్వచ్ఛమైన గాలి లేకుండా చేస్తుందని విమర్శించారు ప్రధాని.