ప్రముఖ బాలీవుడ్ సింగ్ కనికా కపూర్‌కు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. లండన్ నుంచి మార్చి 9న ఉత్తర ప్రదేశ్ వచ్చిన కనికా కపూర్ హోటల్లో బస చేసింది. ఆ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను ఆమె కలవడమే కాకుండా పార్టీ కూడా చేసుకున్నారు. కరోనా సోకినట్లు తేలడంతో సంచలనం రేగింది. ఆ తర్వాత ఆమెను క్వారంటైన్లోకి పంపించారు. ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా పార్టీలకు వెళ్ళడం వలన ఆమెపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత ఆమెను క్వారంటైన్లోకి పంపించారు. వరసగా నాలుగు సార్లు కరోనా పాజిటివ్ వచ్చినా.. ఐదోసారి ఆమెకు నెగిటివ్ రావడంతో ఊపిరి డాక్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం రిపోర్టులలో నెగిటివ్ అని వచ్చినప్పటికీ మరికొంత కాలం ఆమె ఆసుపత్రిలో ఉండనున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు బాలీవుడ్ లో మరో సంచలనం రేకెత్తించింది. కనికా కపూర్ స్నేహితురాలు, బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరానీ కుమార్తె షాజా మొరానీకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ఉన్న కోవిడ్ వార్డులో ఆమెకు ప్రస్తుతం డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. షాజా మోరానీ కుటుంబసభ్యులకు కూడా వైద్యులు కరోనా పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. లాక్ డౌన్‌కు ముందే ఆస్ట్రేలియా నుంచి షాజా ఇండియాకు తిరిగొచ్చింది. షారుఖ్ ఖాన్, దీపికా పడుకునే జంటగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ను కరీమ్ మొరానీ నిర్మించారు. ఇప్పుడు బాలీవుడ్లో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.