అల్లరి నరేష్ హీరోగా సునీల్ ముఖ్య పాత్రలో భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. ఈ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. సెప్టెంబర్ 7న విడుదల కాబోతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. సినిమాపై అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్ ఉండటంతో తప్పకుండా ఈ చిత్రం ఆకట్టుకుంటుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. మిడిల్ క్లాస్ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంకు మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ అవుతుంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై నమ్మకం కలగడంతో ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్ర రైట్స్‌ను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాడు.
సీడెడ్, వైజాగ్ మినహా మొత్తం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను అనిల్ సుంకర భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. ఒక వైపు అనిల్ సుంకర వరుసగా చిత్రాలు నిర్మిస్తూనే, తనకు మంచి సినిమా అనిపిస్తే రైట్స్‌ను కొనుగోలు చేస్తున్నాడు. తాజాగా ఈచిత్రంను అనీల్ సుంకర హోల్ సేల్‌గా కొనుగోలు చేసిన కారణంగా అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఈ చిత్రంలో అల్లరి నరేష్ మరియు సునీల్‌లు బ్రదర్స్‌గా కనిపించబోతున్నారు. చాలా కాలంగా అల్లరి నరేష్ సినిమాలు సక్సెస్‌కు నోచుకోవడం లేదు. దాంతో ఈ చిత్రం అయినా అల్లరోడికి చాలా కీలకంగా మారింది. సునీల్ కూడా కమెడియన్‌గా ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. సునీల్‌కు కూడా ఈ చిత్రం చాలా ముఖ్యం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.