టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు కొత్త వ్యాపారం మొదలు పెట్టినట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే స్టూడియో అధినేతగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, థియేటర్ యాజమానిగా ఇంకా పలు రకాలుగా సంపాదిస్తున్న నిర్మాత సురేష్‌బాబు ఇప్పుడు పాడి పరిశ్రమను స్థాపించినట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే ఈయన హైదరాబాద్ శివారు ప్రాంతంలో దాదాపు 50 ఎకరాల భూమిని తీసుకుని, అందులో 30 పశువులతో పాడి పరిశ్రమను స్థాపించడం జరిగింది. ఈ పాడి పరిశ్రమ పూర్తిగా శాస్త్రీయ పద్దతిలో, ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా జరుగుతుందని చెబుతున్నారు.
సురేష్‌బాబు పెంచుతున్న ఆవులకు కేవలం సేంద్రీయ ఆహారం మాత్రమే ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఫాంకు హ్యాపీ ఆవులు అనే పేరును కూడా ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఈ ఆవుల నుండి సేకరించిన పాలకు భారీగా డిమాండ్ ఉంది. హైదరాబాద్‌లోని సెలబ్రెటీలు అంతా కూడా ప్రస్తుతం ఈ పాల కోసం ఆర్డర్ చేస్తున్నారు. దాదాపు 100 కుటుంబాలకు ఈ పాలను సరఫరా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆవుల సంఖ్యను మరింత పెంచే ఉద్దేశ్యంతో సురేష్‌బాబు ఉన్నట్లుగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ రకమైన ఆధాయం సురేష్‌బాబుకు అక్కర్లేదు. కాని సురేష్‌బాబు స్వచ్చమైన పాను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. భవిష్యత్తులో సురేష్‌బాబు సామాన్యులకు కూడా తన హ్యాపీ ఆవుల పాలను సరఫరా చేస్తాడేమో చూడాలి.