డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ గతంలో సంవత్సరంకు మూడు నాలుగు చిత్రాలు చేసేవాడు. కాని ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఈయనతో సినిమాలు చేసేందుకు హీరోలు ఆసక్తి చూపక పోవడంతో ఈయన తన కొడుకుతో సినిమాను చేశాడు. ‘మెహబూబా’ టైటిల్‌తో రూపొందిన ఆ చిత్రం ఆకట్టుకోలేక పోయింది. పూరితో పాటు, ఆయన తనయుడు ఆకాష్‌కు కూడా ఆ చిత్రం చెడ్డ పేరు తెచ్చింది. ఏమాత్రం ఆకట్టుకోక పోవడంతో పూరి క్రేజ్ మరింతగా తగ్గింది. ఈయనతో కొత్త హీరోలు కూడా సినిమాలు చేసేందుకు జంకుతున్నారు. ఇలాంటి సమయంలో పూరి అంతా కొత్త వారితో సినిమాను తెరకెక్కించేందుకు సిద్దం అవుతున్నాడు.
పూరి సొంత బ్యానర్ పూరి కానెక్ట్స్ నుండి కాస్టింగ్ కాల్‌కు అధికారిక ప్రకటన వచ్చింది. పూరి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న కొత్త చిత్రం కోసం నూతన నటీనటుల ఎంపిక కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నట్లుగా పూరి అసిస్టెంట్స్ చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో అంతా కొత్త వారే నటిస్తారా లేదంటే హీరో పాత్రను ఇప్పటికే హీరోగా పేరు తెచ్చుకున్న వారు ఎవరైనా నటిస్తారా అంటూ చర్చ జరుగుతుంది. పూరి కాస్టింగ్ కాల్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుతో పాటు లీడ్ రోల్స్ కోసం అమ్మాయిు అబ్బాయిలు కావాలి అంటూ ప్రకటన ఇచ్చారు. పూరి తన తదుపరి చిత్రాన్ని దసరా తర్వాత మొదలు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆకాష్ పూరితో కూడా ఒక చిత్రాన్ని పూరి చేయాల్సి ఉంది.