Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డ్రగ్స్ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. దర్శకుడు పూరి జగన్నాథ్ ని సిట్ అధికారులు విచారిస్తూ తరచూ గోవా ఎందుకు వెళ్తారు అనే ప్రశ్న పదేపదే వేశారు. నన్ను అడిగినట్టే తరచూ గోవా వెళ్లే ఆ పత్రికాధిపతిని ఎందుకు అడగడం లేదని పూరి ఎదురు ప్రశ్నించాడట. అప్పుడు ఆ పత్రికాధిపతి గురించి కూపీ లాగడానికి సిట్ ఓ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించిందట. ఇంతకీ ఆ పత్రిక అధినేత ఎవరబ్బా అని తలలు బద్దలు కొట్టుకుంటుంటే ఇంకో విషయం షాక్ కి గురి చేసింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న మరి కొన్ని ముఠాల్ని అరెస్ట్ చేసిన అధికారులు వారిని విచారిస్తున్నప్పుడు వారి ఫోన్స్ లో విలేకరుల నంబర్లు దొరికాయట.
ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు డ్రగ్స్ విక్రయించే పీయూష్ అనే అతని సెల్ ఫోన్ ని విశ్లేషించినప్పుడు వివిధ మీడియా సంస్థల్లో పనిచేసే పలువురు విలేకరులతో అతను సంభాషించినట్టు గుర్తించారు. వారితో వున్న పరిచయాలు, సంబంధాల గురించి పీయూష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా దాదాపు 15 మంది విలేకరులకు విచారణ కోసం సిట్ ముందుకు రావాలని నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. ఈ విలేకరులని ఈ నెల 24 న సిట్ విచారించే అవకాశం ఉందట.
మరిన్ని వార్తలు