Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డ్రగ్స్ వ్యవహారంలో పూరి జగన్నాధ్‌ను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 10.30 నిమిషాలకు సిట్ కార్యాలయంకు వెళ్లిన పూరి జగన్నాధ్‌పై ప్రశ్నల వర్షం కురిసింది. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలను సిట్ అధికారులు పూరి ముందు ఉంచారు. పలు ప్రశ్నలకు పూరి సమాధానాలు ఇవ్వగా, కొన్నింటిని దాటవేసేందుకు ప్రయత్నించాడు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5.30 నిమిషాలకు పూరి బయటకు రావాల్సి ఉంది. కాని పూరి రాత్రి 8 గంటలు అయినా బయటకు రాకపోవడంతో మీడియాలో పూరి అరెస్ట్ అంటూ వార్తలు వచ్చాయి. దాంతో పూరి కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది.
అరెస్ట్‌కు సంబంధించిన వార్తలను అకున్ సబర్వాల్ కొట్టి పారేసినా కూడా మీడియాలో మాత్రం పూరికి సంబంధించిన వార్తలు పతాకస్థాయిలో వచ్చాయి. దాంతో పూరి జగన్నాధ్ భార్య స్వయంగా సిట్ ఆఫీస్‌కు వచ్చారు. ఆమెకు సిట్ అధికారులు విచారణ పూర్తి కాలేదు. ఆయన్ను అరెస్ట్ చేయలేదు అంటూ తేల్చి చెప్పారు. దాంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి 10.30 నిమిషాలకు పూరి సిట్ కార్యాలయం నుండి బయటకు వచ్చారు. ఆ సమయంలో మీడియా అక్కడే ఉండగా, మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి చూపించకుండానే బయటకు వెళ్లి పోయాడు. పూరి ఇంటికి చేరుకున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన అభిమానులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు.
మరిన్నివార్తలు