Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో వరుసగా చిత్రాలను నిర్మించి టాలీవుడ్ స్టార్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న రాధాకృష్ణ తాజాగా పవన్ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ చిత్రాన్ని నిర్మించని విషయం తెల్సిందే. అజ్ఞాతవాసి ఫ్లాప్ అయ్యి, డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాల పాలైతే, వారిని ఆదుకునేందుకు సగం మొత్తంను తిరిగి ఇచ్చేసి అందరి దృష్టిని ఆకర్షించిన నిర్మాత రాధాకృష్ణ. ఈయన వరుసగా త్రివిక్రమ్‌తో సినిమాలు చేయడంతో పాటు చిన్న చిత్రాలను కూడా నిర్మించాలని భావిస్తున్నాడు. తాజాగా ‘ఛలో’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న వెంకీ కుడుములతో నిర్మాత రాధాకృష్ణ భారీ మొత్తంకు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది.
నాగశౌర్య, రష్మిక జంటగా తెరకెక్కిన ‘ఛలో’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు వెంకీ కుడుములతో చిత్రాన్ని నిర్మించేందుకు పలువురు నిర్మాతలు ఆసక్తి చూపించారు. అయితే వెంకీ వద్ద ఉన్న స్టోరీ లైన్ రాధాకృష్ణకు నచ్చడంతో భారీ మొత్తం పారితోషికం ఆఫర్ చేసి, వెంటనే అడ్వాన్స్‌ను కూడా ఇచ్చాడు. ప్రస్తుతం పూర్తి స్థాయి స్క్రిప్ట్‌ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. త్వరలోనే హీరో హీరోయిన్స్‌ను ఎంపిక చేయబోతున్నారు. స్టార్ హీరోతో నిర్మాత రాధాకృష్ణ చర్చలు జరుపుతున్నాడు అంటూ సమాచారం అందుతుంది. మొత్తానికి ఛలో చిత్రం దర్శకుడితో రాధాకృష్ణ చేయబోతున్న సినిమాపై సినీ వర్గాల్లో చాలా ఆసక్తి నెలకొంది. సమ్మర్‌లో వెంకీ కుడుముల మరియు రాధాకృష్ణల చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.