యాంగ్రీ యంగ్‌మన్ ‘గరుడవేగ’ చిత్రం తర్వాత హీరోగా మళ్లీ బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకోసం ఒక భారీ చిత్రాన్ని మొదలు పెట్టాడు. ‘కల్కీ’ అనే టైటిల్‌తో రూపొందబోతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కులూమనాలీలో జరుపుతున్నారు. కులూమనాలీలో చిత్రీకరణ కోసం వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ అయ్యిందట. కొండ చెరియలు విరిగి పడటంతో ప్రమాదం జరిగిందని, తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నట్లుగా రాజశేఖర్ స్వయంగా ప్రకటించాడు. ట్విట్టర్ ద్వారా యాక్సిడెంట్ విషయాన్ని తెలియజేసిన రాజశేఖర్ అక్కడ పరిస్థితి ఏంటీ అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. యాక్సిడెంట్ అయిన మాట వాస్తవమే కాని, అంతా బాగానే ఉన్నాం, షూటింగ్ జరుపుతున్నాం అంటూ ప్రకటించాడు.
ఈ యాక్సిడెంట్‌కు ముందు ఒక స్టంట్ సీన్ చిత్రీకరణ సమయంలో తనకు గాయం అయ్యిందని, అయినా కూడా తాను చిత్రీకరణలో పాల్గొంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా డేట్లు ఇచ్చి ఉన్నారు. వారి డేట్లు అన్ని కూడా వృదా అవుతాయనే ఉద్దేశ్యంతో తాను గాయంతోనే చిత్రీకరణలో పాల్గొంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. తనకు యాక్సిడెంట్ అయిన సమయంలో తన కుటుంబ సభ్యులు కూడా తన పక్కనే ఉన్నారని, వారికి కూడా ఏం కాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. కుటుంబం మొత్తం కులూమనాలికి ఎందుకు వెళ్లారో వారికే తెలియాలి. చిత్రీకరణ కోసం అందరు వెళ్లాల్సిన అవసరం ఏంటో అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.