Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్‌ల కాంబినేషన్‌లో ‘రోబో’ చిత్రం తర్వాత వస్తున్న చిత్రం ‘2.0’. భారీ అంచనాలున్న ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనాలు నమోదు చేస్తుంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతు ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ చిత్రంగా ఈ చిత్రం రికార్డు సాధించింది. తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇండియాలోని దాదాపు అన్ని భాషల్లో కూడా డబ్ అవుతుంది. ముఖ్యంగా హిందీలో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. మూడు వేల కోట్ల టార్గెట్‌గా ఈ చిత్రం విడుదల కాబోతుంది. హాలీవుడ్‌లో కూడాఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక ముస్లీం ఆచారాలు ఎక్కువగా పాటించే సౌదీ అరేబియాలో దాదాపు 30 సంవత్సరాలుగా సినిమాల ప్రదర్శణ నిలిపేయడం జరిగింది. ఇతర దేశాలకు చెందిన సినిమాలు అక్కడ విడుదల చేయడం చాలా అరుదైన విషయం. ముప్పై సంవత్సరాల తర్వాత ఇటీవలే అక్కడ కండీషన్స్‌ను సడలిస్తున్నారు. అది కాస్త రజినీకాంత్ మూవీకి కలిసి వచ్చింది. హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో అక్కడ విడుదల చేసేందుకు ఫిల్మ్ మేకర్స్ సిద్దం అవుతున్నారు. సౌదీ అరేబియాలో చాలా కాలం తర్వాత సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో మంచి స్పందన దక్కే అవకాశం ఉంది. సౌదీతో ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.