బాలీవుడ్ నటి తనూశ్రీ తనపై జరిగిన లైంగిక దాడులను బట్టబయలు చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడంటూ నానాపై లైంగిక ఆరోపణలు చేసింది. మీ టూ ఉద్యమం దేశవ్యాప్తం కావడానికి తనూశ్రీ ముఖ్య కారణం అని చెప్పవచ్చు. దాంతో వివిధ రంగాల్లోని మహిళలలు కూడా తమపై జరిగిన లైంగిక దాడులను బయట పెడుతున్నారు. మీ టూ విషయంలో తనూశ్రీకి పలువురు బాలీవుడ్ ప్రముఖులు మద్దతు తెపగా కొంతమంది విమర్శించారు. బాలీవుడ్ శృంగారతార రాఖీ సావంత్ తనూశ్రీపై చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారాయి.
తనూశ్రీ డ్రగ్స్ తీసుకుని వ్యాన్‌లో ఉంటే నానా సూచన మేరకు నేను నానాతో కలిసి ఓ సాంగ్ చేయాల్సి వచ్చింది. డ్రగ్స్ తీసుకుని దాదాపు నాలుగు గంటల పాటు తనూశ్రీ వ్యాన్‌లో స్పృహ లేకుండా పడి ఉంటే తాను చేయాల్సిన పాటను నేను పూర్తి చేశాను, అలాంటిది ఈ రోజు పెద్ద పెద్ద మాటలు చెబుతోంది, తనుశ్రీ అసలు బాగోతాన్ని నేను బయట పెట్టాలనుకుంటున్నాను అంటూ రాఖీ సావంత్ తనూశ్రీపై హాట్ కామెంట్స్ చేసింది. దాంతో రాఖీ చెప్పేవన్నీ అబద్దాలే, ఈ విషయంలో తాను న్యాయ పోరాటం చేస్తాను అంటూ తనూశ్రీ రాఖీపై 10కోట్ల పరువు నష్టం దావా వేసింది. తనకు నోటీసులు అందినట్టుగా రాఖీ స్వయంగా చెప్పుకొచ్చింది.