టాలీవుడ్లో ఒకప్పుడు ఐటెం సాంగ్స్‌కు ప్రత్యేక హీరోయిన్స్ ఉండే వారు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది, ఐటెం సాంగ్స్‌ను ప్రత్యేకంగా హీరోయిన్స్‌తో కాకుండా స్టార్స్ హీరోయిన్స్‌తో చేయించేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నాడు. మెయిన్ హీరోయిన్‌కు ఏమాత్రం తగ్గకుండా ఐటెం సాంగ్స్ చేసే హీరోయిన్స్‌కు పారితోషికం అందుతుంది. అందుకే తమన్నా, కాజల్ వంటి వారు ఐటెం సాంగ్స్‌ను చేసేందుకు ముందుకు వస్తున్నారు. కోట్లల్లో పారితోషికం వస్తున్న కారణంగా ఐటెం సాంగ్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. వరుసగా కాజల్, తమన్నాలు ఐటెం సాంగ్స్ చేస్తుంటే రకుల్ ప్రీత్‌సింగ్ మాత్రం ఐటెం సాంగ్స్‌కు కాస్త వెనుకాడుతుంది. ఈ అమ్మడు ప్రస్తుతం హీరోయిన్గా పెద్దగా అవకాశాలు లేకపోయినా కూడా ఐటెం సాంగ్స్‌ను చేసేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్‌తో ఐటెం సాంగ్‌ను చేయించేందుకు దర్శకుడు బోయపాటి ప్రయత్నించాడు. గతంలో రకుల్ ప్రీత్ సింగ్ వీరిద్దరితో కలిసి వర్క్ చేసింది. అయినా కూడా ఈ చిత్రంలో ఐటెం సాంగ్‌ను చేసేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు. త్వరలోనే తనకు మళ్లీ స్టార్ హీరోల సరసన ఛాన్స్ వస్తాయని, ఇప్పుడు ఐటెం సాంగ్స్‌ను చేస్తే క్రేజ్ తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఐటెం సాంగ్స్ చేసినంత మాత్రాన హీరోయిన్గా క్రేజ్ తగ్గుతుందని భావించడం ఈమె అవివేకాం అని, అసలు అలాంటి ఆలోచనే అక్కర్లేదు అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఐటెం సాంగ్స్‌ను చేసేవారిని ప్రేక్షకులు చీప్‌గా చూస్తారనే అర్థంపర్థం లేని ఆలోచనలో ఉన్నట్లుగా అనిపిస్తుంది.